MP Crime: చిన్న వీడియో వల్ల ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. షాపులు, వాహనాలు ధ్వంసం చేశారు. పోలీసులు రంగంలోకి దిగి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. దీని వెనుక కారణమేంటో తెలుసా? ఆవుపై ఓ వ్యక్తి అసహజ చర్యకు పాల్పడినట్టు వీడియో క్లిప్ వైరల్ కావడం ఇందుకు కారణమైంది. సంచలనం రేపిన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది.
మధ్యప్రదేశ్‌లో దారుణం.. ఆవుపై అసహజ చర్య
మధ్యప్రదేశ్ బేతుల్ జిల్లాలోని దమ్జీపుర గ్రామంలో ఓ వ్యక్తి.. ఆవుపై అత్యాచారం చేసినట్టు వీడియో కలకలం రేపింది. ఈ వీడియో చూసిన స్థానికులు రెచ్చిపోయారు. తొలుత ఆందోళన చేపట్టారు.. అది కాస్త ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ క్రమంలో స్థానికులు దుకాణాలు, వాహనాలు ధ్వంసం చేసి తగులబెట్టారు. చివరకు ఆ కామాంధుడి ఇంటిని ధ్వంసం చేసి నిప్పు పెట్టారు.
ఈ ప్రాంతంలో చెలరేగిన అల్లర్ల గురించి తెలియగానే పోలీసులు రంగం ప్రవేశం చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. మళ్లీ అల్లర్లు తలెత్తకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా దాదాపు 200 మంది పోలీసులు ఆ గ్రామంలో మోహరించారు. అంతేకాదు సమీపంలోని ఖాండ్వా నుండి బలగాలను రప్పించారు బేతుల్ ఎస్పీ.
రెచ్చిపోయిన స్థానికులు.. షాపులు ధ్వంసం
వైరల్ క్లిప్ గురించి ఆయన మాట్లాడారు. దాదాపు 50 ఏళ్ల ఓ వ్యక్తి.. ఆవుతో అసహజ చర్యకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని అన్నారు. ఆ వీడియో బయటపడిన తర్వాత పోలీసులు చర్యలు చేపట్టారని, నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో షాపులు, మార్కెట్ వేశారు.
శనివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఆ వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్టు చెబుతున్నారు. అయితే ఆ వీడియోను చిత్రీకరించిన స్థానిక యువకుడు ఎవరికీ సమాచారం ఇవ్వలేదు. కాకపోతే ఆదివారం ఆ వీడియో షేర్ చేశాడు. స్థానికులు ఆందోళనలో ప్రాణ నష్టం లేదని, ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం.
ALSO READ: ధూల్‌పేటలో గంజాయి దందా గుట్టురట్టు.. ఎక్సయిజ్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్!
దాదాపు 10 దుకాణాలు అల్లరి మూక ధ్వంసం చేసింది. ఈ విషయంలో స్థానికులు ప్రశాంతంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్‌లో పుకార్లు లేదా రెచ్చగొట్టే కంటెంట్‌ను వ్యాప్తి చేయవద్దని హెచ్చరించారు. శాంతికి భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.