E-Paper
Advertisement

Union Budget 2026: బడ్జెట్ 2026… ఆటో ఇండస్ట్రీపై ప్రభావం ఎంత? నిపుణులు ఏం చెప్తున్నారు?

Union Budget 2026: బడ్జెట్ 2026… ఆటో ఇండస్ట్రీపై ప్రభావం ఎంత? నిపుణులు ఏం చెప్తున్నారు?
Advertisement

Budget 2026–27 Impact on  Auto Industry: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పార్లమెంటులో 2026–27 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో భాగంగా, ఆటో ఇండస్ట్రీపై కీలక ప్రోత్సాహకాలు ప్రకటించారు. ముఖ్యంగా క్లీన్ మొబిలిటీ లాంటి వ్యూహాత్మక రంగాలను మరింత బలోపేతం చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. తాజాగా బడ్జెట్ మీద ప్రముఖ ఆటోమోటివ్ బ్రాండ్‌లు స్పందించాయి. ఇంతకీ ఆయా కంపెనీలు ఏమన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆటో ఇండస్ట్రీ వృద్ధి వేగాన్ని కొనసాగించేలా బడ్జెట్ ఉన్నట్లు BMW గ్రూప్ ఇండియా అధ్యక్షుడు, CEO హర్దీప్ సింగ్ బ్రార్ అన్నారు. ఆర్థిక ఏకీకరణ, వృద్ధి మధ్య సమతుల్యతను ఆయన హైలైట్ చేశారు. అదే సమయంలో, మూలధన వ్యయం పెరుగుదల మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేస్తుందన్నారు. రహదారుల నాణ్యతను మెరుగుపరుస్తుందన్నారు. క్లీన్ మొబిలిటీ పర్యావరణ వ్యవస్థలను మెరుగుపరుస్తుందన్నారు.

Advertisement

అటు కేంద్ర బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలు, మూలధన వ్యయంపై బలమైన ప్రాధాన్యత ఇండియన్ ఆటో రంగానికి సానుకూల ధోరణిగా ఉండబోతుందని ఆడి ఇండియా బ్రాండ్ డైరెక్టర్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ అన్నారు. మెరుగైన హైవేలు, ఇంటర్‌ సిటీ కనెక్టివిటీ, ముఖ్యంగా టైర్-II, టైర్-III మార్కెట్లలో, లగ్జరీ ఆటోమొబైల్స్ కోసం యాజమాన్యం, వినియోగదారుల మధ్య సానుకూల పరిస్థితులు ఏర్పడుతాయన్నారు.

అటు టైర్లు ఉత్పతిత్తో పాటు ఉపాధి అవకాశాలు పెరిగే తాజాగా బ్జెట్ ఉందని JK టైర్ & ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రఘుపతి సింఘానియా అన్నారు. ఉపాధిని పెంచడంలో స్థిరమైన మౌలిక సదుపాయాల వ్యయం, నైపుణ్యాభివృద్ధి చొరవ పెరుగుతుందన్నారు. 26-27 ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్ తయారీ ఆధారిత వృద్ధి బలోపేతం అవుతుందన్నారు. 4.3% ఆర్థిక ఏకీకరణతో పాటు, రూ. 12 లక్షల కోట్లకు పైగా మౌలిక సదుపాయాల కేటాయింపునకు ఆమోదం తెలపడం మంచి నిర్ణయమన్నారు. MSME వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందన్నారు.  ఆటోమోటివ్, టైర్ రంగాలకు, మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్‌ లో స్థిరమైన పెట్టుబడులు ఖర్చు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయన్నారు.

ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 ప్రభావం ఎంత?

Advertisement

అటు ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0కి పురోగతి, పరికరాలు, పదార్థాలు, పూర్తి స్టాక్ ఇండియన్ IP, సరఫరా చైన్  బలోపేతంపై దృష్టి సారించి, ఆటో మోబైల్ ఇండస్ట్రీ అభివృద్ధి చెందుతున్న అవసరాలకు దగ్గరగా బడ్జెట్ ఉందని రెనాల్ట్ గ్రూప్ ఇండియా CEO స్టెఫాన్ డెబ్లైస్ వెల్లడించారు. లిథియం-అయాన్ సెల్స్ కోసం మూలధన వస్తువులపై  కస్టమ్స్ సుంకం మినహాయింపులు మేలు కలిగించనున్నట్లు తెలిపారు. ఈ బడ్జెట్ ప్రపంచంలో భారత్ పోటీతత్వాన్ని పెంచడంపై దృష్టి పెడుతుందని మహీంద్రా గ్రూప్ CEO, MD డాక్టర్ అనిష్ షా వెల్లడించారు. ఆత్మనిర్భరత వైపు  అనుకూలమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆర్థిక వృద్ధి ప్రయోజనాలలో విస్తృత భాగస్వామ్యాన్ని అనుమతిస్తుందన్నారు.  ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్ దేశ క్లీన్ మొబిలిటీ, అధునాతన తయారీ వ్యవస్థకు బలమైన పునాది వేస్తుందన్నారు.

Read Also:  చౌకైన బ్యాటరీలు, CNG బ్లెండింగ్.. ఆటో ఇండస్ట్రీకి బడ్జెట్ బూస్టింగ్!

Related News

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

Big Stories

Advertisement
×