E-Paper
Advertisement

Crime News: మైనర్‌పై అఘాయిత్యం.. ఆత్మహత్య

Crime News: మైనర్‌పై అఘాయిత్యం.. ఆత్మహత్య
Advertisement

Tamil Nadu: తమిళనాడులో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. ఆ తర్వాత అత్యాచారం చేసిన నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అదే సందర్భంలో నిందితుడి తండ్రి కూడా ఓ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ రెండు కేసులను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలు తమిళనాడులోని సేలం జిల్లాలో చోటుచేసుకున్నాయి.

క్రిష్ణగిరి జిల్లాలోని బర్గూర్‌లో ఓ ఫేక్ ఎన్సీసీ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్‌నకు వచ్చిన 12 ఏళ్ల బాలికపై 30 ఏళ్ల శివరామన్ లైంగికదాడి చేశాడు. ఆ తర్వాత శివరామన్ పారిపోయాడు. ఆత్మహత్య చేసుకోవాలని ఎలుకల మందు తాగాడు. పోలీసులు శివరామన్‌ను పట్టుకున్నారు. ఆగస్టు 18న శివరామన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

అప్పుడు కూడా శివరామన్ వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసి కాలు విరుగ్గొట్టుకున్నాడు. దీంతో పోలీసులు శివరామన్‌ను అరెస్టు చేసి హాస్పిటల్‌లో చికిత్స కోసం అడ్మిట్ చేశారు. ప్రాథమిక చికిత్స తర్వాత స్పెషలైజ్డ్ కేర్ కోసం శివరామన్‌ను ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. వైద్య బృందాలు ఎంత కష్టపడ్డా.. శివరామన్‌ను కాపాడుకోలేకపోయారు. శుక్రవారం తెల్లవారుజామున శివరామన్ మరణించాడు. కుటుంబ కలహాల కారణంగా శివరామన్ గత నెలలోనే విషం తాగినట్టు అధికారులు తెలిపారు. అప్పుడు తొమ్మిది రోజులు ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందాక ప్రాణాలతో బయటకు వచ్చాడని వివరించారు. కానీ, అత్యాచారం తర్వాత ఎలుకల మందు తాగిన శివరామన్ చికిత్స పొందుతూనే మరణించాడని చెప్పారు.

Also Read: GN Saibaba: తెలంగాణ గడ్డ మలిచిన బిడ్డను నేను: ప్రొ. జీఎన్ సాయిబాబా

Advertisement

కాగా, గురువారం రాత్రి మరో ఘటనలో శివరామన్ తండ్రి మరణించాడు. కావేరిపట్టిణంలో తన మోటార్ బైక్ నుంచి కిందపడిపోయి ఆయన మరణించాడు. ఉద్దేశపూర్వకంగానే ఆయన కిందపడిపోయినట్టుగా కనిపిస్తున్నదని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ రెండు మరణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ రెండు ఘటనలు స్థానికంగా కలకలం రేపాయి. తండ్రీ కొడుకులు మరణించడంతో బంధువులు శోకంలో మునిగిపోయారు.

నిందితుడు శివరామన్ నామ్ తమిళార్ కాచి పార్టీలో గతంలో పని చేశాడు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×