Teacher commits suicide: ఏపీలో మహిళలపై దాడులు పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ప్రతిరోజూ ఏదో ఒక ఘటన వెలుగులోకి వస్తుంది. అత్యాచారాలు, ప్రేమోన్మాదాల దాడులు ఇలా వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించాలని యువకుడు వేధించడంతో టీచర్ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన భీమిలి మండలం యజ్జివలస గ్రామంలో చోటు చేసుకుంది.
Also read: మాజీ మంత్రి కేటీఆర్ పై క్రిమినల్ కేసు.. ఆ ఆరోపణలపై సృజన్ రెడ్డి సీరియస్
పూర్తి వివరాల్లోకి వెళితే… రాశి అనే యువతి డిగ్రీ పూర్తి చేసి గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యా వాలంటీర్ గా పనిచేస్తోంది. కాగా అదే గ్రామానికి చెందిన పిల్లి రాజు అనే యువకుడు యువతి వెంట పడటం మొదలు పెట్టాడు. తనను ప్రేమించాలని ఇబ్బంది పెట్టాడు. తనకు ఇష్టం లేదని ఎంత చెప్పినా పట్టించుకోకుండా వేధింపులు ఎక్కువ చేశాడు. ఈ క్రమంలో యువతి తీవ్రమనోవేదనకు గురైంది. తన బాధను ఎవరికీ చెప్పుకోలేక ఇంట్లో ఉన్న పురుగుల మందును తాగింది.
ఈ నెల 16న యువతి పురుగుల మందు తాగగా కుటుంబ సభ్యులు వెంటనే స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో యువతి మృతి చెందింది. ఆమె తల్లి దండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసకుని విచారణ జరిపారు. నిందితుడు రాజును అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. యువతి మృతితో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.