Yashasvi Jaiswal: పెర్త్ టెస్ట్‌లో యశస్వి జైస్వాల్ అదరగొట్టాడు. ఈ తరుణంలోనే… భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ( Yashasvi Jaiswal ) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పెర్త్‌లో టీమిండియా vs ఆస్ట్రేలియా 1వ టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్ మూడో రోజు సందర్భంగా భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 22 ఏళ్ల ఓపెనర్ యశస్వి జైస్వాల్ ( Yashasvi Jaiswal ) …ఆస్ట్రేలియా గడ్డపై తొలి సెంచరీ చేసుకుని రికార్డుల్లోకి ఎక్కాడు.
Also Read: IPL Auction 2025: రేపే వేలం.. అందరికన్ను ఈ వికెట్ కీపర్లపైనే.. పంత్ పై కోట్ల వర్షం గ్యారెంటీ?
జైస్వాల్ సెంచరీ పూర్తి చేసేందుకు 205 బంతులు తీసుకున్నాడు. జులై 2023లో వెస్టిండీస్‌తో జరిగిన అరంగేట్రం మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో.. తన కెరీర్ లో మొత్తం 4 టెస్ట్ సెంచరీలు పూర్తి చేసుకున్నాడు భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ( Yashasvi Jaiswal ) . విదేశీ గడ్డపై రెండు సెంచరీలు చేసుకున్నాడు.
కేవలం 16 నెలల స్వల్ప కెరీర్‌లో, జైస్వాల్ 15 టెస్టు మ్యాచ్‌ల్లో 57.50 సగటుతో మొత్తం 1495 పరుగులు చేశాడు. ఈ తరుణంలోనే… ఇప్పటికే ఎనిమిది అర్ధ సెంచరీలు. నాలుగు సెంచరీలు సాధించాడు జైస్వాల్. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇంగ్లాండ్‌పై 214 పరుగుల అత్యుత్తమ స్కోరుతో రికార్డు సృష్టించాడు. జైస్వాల్ తన 1495 పరుగులలో 2024లో ఆడిన 12 టెస్టు మ్యాచ్‌ల్లో 1210 పరుగులు చేశాడు.
Also Read: IND vs Aus BGT Trophy: బుమ్రా దెబ్బకు 104 పరుగులకే కుప్పకూలిన ఆసీస్..!