BigTV English

Tejeshwar Murder Case: తేజశ్వర్‌నే కాదు.. సొంత అన్నను కూడా చంపిందా ? బయటికి వస్తున్న ఐశ్వర్య లీలలు

Tejeshwar Murder Case: తేజశ్వర్‌నే కాదు.. సొంత అన్నను కూడా చంపిందా ? బయటికి వస్తున్న ఐశ్వర్య లీలలు

Tejeshwar Murder Case: కత్తి పోట్లు తప్ప.. కట్టుబాట్లు లేవు! వ్యక్తిగత స్వార్థం తప్ప.. మానవతా విలువల్లేవ్! జీవిత భాగస్వామి అనే పదానికే అర్థం మారిపోయిందిప్పుడు. మగాళ్ల జీవితాల్లోకి భార్యల్లా వచ్చి.. మరొకరి భాగస్వామిగా మారాలనే కోరికలతో రగిలిపోయే నీచమైన మనస్తత్వాలు ఉన్న కొందరు ఆడవాళ్లు.. అనవసరంగా భర్తల ప్రాణాలు తీసేస్తున్నారు. గద్వాల్ తేజేశ్వర్ మర్డర్ కేసులో విస్తుపోయే విషయాలెన్నో ఉన్నాయ్. ఐశ్వర్య ఆలోచనలు, క్రూరమైన మనస్తత్వం ఎలా ఉందో తెలిస్తే.. మీ మైండ్ బ్లాంక్ అవడం ఖాయం.


తేజేశ్వర్‌ను చంపి, మృతదేహాన్ని మాయం చేసేందుకు ఐశ్వర్య, తిరుమలరావు స్కెచ్చేశారు. తేజేశ్వర్ మృతదేహాన్ని కర్నూలు శివార్లలోని ఓ రియల్‌ఎస్టేట్ వెంచర్‌లో పూడ్చాలని ప్రయత్నించారు. తేజేశ్వర్‌ హత్యకు నగేష్, పరశురామ్, రాజు అనే ముగ్గురికి.. తిరుమలరావు 2 లక్షల రూపాయల సుపారీ ఇచ్చాడు. పని పూర్తయ్యాక లద్దాఖ్ పారిపోవాలని తిరుమలరావు, ఐశ్వర్య ప్లాన్ చేసుకున్నారు. అక్కడే సహజీవనం చేయాలనుకున్నారు. లద్దాఖ్‌లో సెటిలవ్వడానికి బ్యాంక్‌ నుంచి తిరుమలరావు 20 లక్షలు లోన్ కూడా తీసుకున్నాడు. తేజేశ్వర్‌ని చంపేశాక మృతదేహాన్ని కారులో కర్నూలు తీసుకెళ్లి.. తిరుమలరావుకు చూపించింది సుపారీ గ్యాంగ్. తేజేశ్వర్‌ డెడ్‌బాడీ చూశాకే ఆ గ్యాంగ్‌కు తిరుమలరావు డబ్బు ఇచ్చాడు.

హత్య సమయంలో కారు ముందు సీట్లో తేజేశ్వర్ కూర్చుని ఉండగా.. వెనుక నుంచి అతని మెడ పట్టుకుని గొంతు కోశాడు.. పరమేశ్వర్. ఆ తర్వాత డ్రైవర్ సీట్లో ఉన్న నగేష్, తేజేశ్వర్ పొట్టలో కత్తితో పొడిచాడు. ప్రాణం పోయే ముందు తన పొట్టలో దిగిన కత్తిని తీసి నగేష్‌పై తేజేశ్వర్ దాడి చేయడంతో.. నగేష్‌ చేతికి గాయమైంది. తీవ్ర గాయాలతో రక్తమోడుతున్న తేజేశ్వర్‌ను ముందు సీట్లో నుంచి వెనక సీట్లోకి మార్చారు.. నిందితులు. తేజేశ్వర్ అదృశ్యం తర్వాత పోలీసుల విచారణ వేగంగా జరగడంతో.. డెడ్‌బాడీని రియల్ ఎస్టేట్ వెంచర్‌లో పూడ్చకుండా పాణ్యం దగ్గర పొదల్లో పడేసి వెళ్లిపోయారు.


“తేజేశ్వర్ హత్య కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. తన తల్లి, చెల్లికి తిరుమలరావుతో ఉన్న సంబంధం నచ్చక పలుమార్లు వారిని ఐశ్వర్య అన్న నవీన్ తిట్టేవాడని తెలిపిన స్థానికులు. ఇటీవల ఇంట్లో జారిపడి మరణించాడని తెలిపిన ఐశ్వర్య అన్న నవీన్ మృతిపైన కూడా అనుమానాలు ఉన్నాయని, ఆ కోణంలో కూడా విచారణ జరుపుతామని తెలిపిన పోలీసులు.”

ప్రస్తుతం పోలీసుల అదుపులో తిరుమల రావుతో సహా నిందితులందరూ ఉన్నారు. గతంలో తిరుమలరావు దొంగ నోట్ల వ్యాపారం చేస్తూ పోలీసులకు పట్టుబడడంతో.. డెకాయిట్ షీట్ పోలీసులు ఓపెన్ చేశారు. నేర చరిత్ర కలిగిన తిరుమల రావుకు బ్యాంకులో మేనేజర్‌గా ఎలా అవకాశం కల్పించారని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Also Read: వేరే వ్యక్తితో భార్య.. నా గతి ఏ మగాడికి పట్టకూడదంటూ భర్త అలాంటి పని!

ఐశ్వర ప్రియుడు, బ్యాంక్ మేనేజర్ తిరుమలరావును పోలీసులు అరెస్ట్‌ చేశారు. గద్వాల జిల్లాకు చెందిన ఓ యువకుడు ఇన్ ఫార్మర్‌గా పని చేసినట్లు.. మరో కొత్త కోణం వెలుగు చూసింది. ఆ యువకుడు తేజేశ్వర్ భార్య ఐశ్వర్యకు తమ్ముడి వరుస అవుతున్నట్లు సమాచారం. ఆ యువకుడు తేజేశ్వర్ స్నేహితుల్లో ఒకరిగా భావిస్తున్నారు. కొంతమందికి కర్నూలు కెన్ ఫిన్ హోమ్స్ లిమిటెడ్ బ్యాంకులో లోన్లు ఇప్పించాడు సదరు యువకుడు. తిరుమల రావు సహకారంతో ప్రతి లోన్ కు 2 శాతం కమిషన్ తీసుకున్నట్లు తెలిసింది. త్వరితగతిన లోన్లు మంజూరు చేయించినందుకు తిరుమల రావుకు నమ్మకస్తుడిగా మారాడు ఆ యువకుడు. తేజేశ్వర్ ప్రతి అప్డేట్‌ను తిరుమలరావుకు అందించినట్లు సమాచారం. ఇప్పటికే పోలీసులు ఆ అనుమానిత యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. కాల్ డాటా ఆధారంగా విచారణ చేపట్టారు.

Related News

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Big Stories

×