BigTV English

Superfoods: భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఈ సూపర్ ఫుడ్స్ ప్రతిరోజు గుప్పెడైనా తినండి

Superfoods: భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఈ సూపర్ ఫుడ్స్ ప్రతిరోజు గుప్పెడైనా తినండి

ఒకప్పుడు క్యాన్సర్ అరుదుగా వచ్చేది. కానీ ఇప్పుడు అదొక అంటువ్యాధిలా మారిపోయింది. ఎక్కడ చూసినా క్యాన్సర్ కేసులే కనిపిస్తున్నాయి. ప్రతి ఏడాది మనదేశంలో 15 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. అంటే ఎంత తీవ్రంగా జనాభా క్యాన్సర్ బారినపడుతుందో అర్థం చేసుకోండి. క్యాన్సర్లో ఎన్నో రకాలు ఉన్నాయి. ఏవి రాకుండా జాగ్రత్త పడాలన్నా ముందుగానే ఆహారపు అలవాట్లను, జీవనశైలిని మార్చుకోవాలి.


క్యాన్సర్ రాకుండా అడ్డుకునే ఆహారాలు మన చుట్టూనే ఉన్నాయి. కానీ వాటిని తినేందుకు మాత్రం మనం ఇష్టపడము. భవిష్యత్తులో మీరు క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే ఇక్కడ మేము చెప్పిన కొన్ని ఆహారాలను ప్రతిరోజూ తినేందుకు ప్రయత్నించండి. వీటిలో ఖరీదైనవి, ఖర్చు లేనివి కూడా ఉన్నాయి. ఆరోగ్యం కోసం ఎంతో కొంత డబ్బు ఖర్చు పెట్టాలి. అనారోగ్యం పాలైతే అంతకు రెట్టింపు డబ్బు ఆసుపత్రులకు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకోవాలో తెలుసుకోండి.

వాల్ నట్స్
వాల్ నట్స్ లో ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే పాలీఫెనాల్స్ కూడా ఉంటాయి. ఈ రెండు పోషకాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంలో ముందుంటాయి. వైద్యులు చెబుతున్న ప్రకారం ప్రతి ఉదయం లేదా సాయంత్రం రెండు వాల్ నట్స్ తినేందుకు ప్రయత్నించండి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచడమే కాదు శరీరాన్ని కూడా క్యాన్సర్ బారిన పడకుండా కాపాడతాయి.


తులసి ఆకులు
తులసి ఆకుల కోసం డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఒక తులసి మొక్కను పెంచుకుంటే సరిపోతుంది. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే టీ తాగడం మనందరికీ ఎంతో అలవాటు. దీనికోసం మీరు తులసి ఆకులను ఉపయోగించండి. అంటే మీరు తాగే టీ లో రెండు మూడు తులసి ఆకులను వేసి బాగా మరగపెట్టి ఆ టీ ని తాగేందుకు ప్రయత్నించండి. తులసిలో యూజినాల్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని బలంగా మారుస్తాయి. ఆయుర్వేదంలో తులసిని ఔషధంగా చెప్పుకుంటారు. ఇది క్యాన్సర్ కణాలు పెరుగుదలను నిరోధించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

అల్లం
ప్రతి ఇంట్లోనూ అల్లం ఉంటుంది. చికెన్, చేపలు, కోడి గుడ్లు వంటివి వండినప్పుడు ఖచ్చితంగా అల్లం ముక్క పడాల్సిందే. అల్లంలో కూడా ఔషధ గుణాలు ఎక్కువ. ఇది మన శరీరంలోని హానికరమైన కణాలతో పోరాడే శక్తిని మన రోగనిరోధక శక్తికి అందిస్తుంది. అల్లంలో జింజెరాల్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్ తో పోరాడే లక్షణాలను కలిగి ఉంటాయి. అల్లాన్ని ఆహారంలో భాగం చేసుకుంటే భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. అల్లం టీ ని ప్రతిరోజు తాగేందుకు ప్రయత్నించండి. అలాగే అల్లాన్ని ఆహారంలో భాగం చేసుకోవడానికి ట్రై చేయండి.

పసుపు
పసుపు అద్భుతమైన ఔషధ గుణాలు కలిగినది. దీనిలో కర్కుమిన్ వంటి క్రియాశీలకమైన సమ్మేళనం ఉంటుంది. ఇది శక్తివంతమైన శోధనిరోధక, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. క్యాన్సర్ అభివృద్ధిని కూడా ఇది నిరోధించే శక్తిని కలిగి ఉంది. ప్రతిరోజు ఆహారంలో పసుపును భాగం చేసుకోండి. లేదా పసుపు నీళ్లను లేదా పసుపు టీ ని తాగినందుకు ప్రయత్నించండి. ఏ ఆహారం వండుకున్న అందులో పసుపును వేసుకొని తినేందుకు ప్రయత్నించండి.

బాదం పప్పులు
బాదంపప్పుల్లో మన శరీరానికి అత్యవసరమైన విటమిన్ ఈ, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి కణాలు దెబ్బ తినకుండా కాపాడతాయి. ప్రతిరోజు ఉదయం 4, 5 బాదం పప్పులు తినేందుకు ప్రయత్నించండి. ఇందుకోసం మీరు ముందు రోజు రాత్రి బాదం పప్పులను నీటిలో నానబెట్టుకోవాలి. ఉదయం లేచాక పైన పొట్టును తీసి తినవచ్చు. లేదా పొట్టుతో తింటే ఇంకా మంచిది. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా అధిక రక్తపోటు, గుండెజబ్బులతో బాధపడే వారికి బాదంపప్పులు ప్రతిరోజు తినడం అనేది ఎంతో అవసరం.

Related News

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Big Stories

×