Husband Suicide Wife Affair: వారి బంధం పెళ్లిగా మారినా.. మనసులు మారిపోయాయి. భార్య వేరే వ్యక్తితో ఉన్నదని తెలిసిన భర్త పరిస్థితి ఎలా ఉండేది? ఇలా ఎవరికీ జరగకూడదు. నా గతి ఎలాంటి మగాడికైనా పట్టకూడదు అంటూ చెప్పాడు ఓ భర్త. చివరికి సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి.. చెట్టుకు ఉరివేసుకొని తన ప్రాణాలను తానే తీసుకున్నాడు. హర్యానా రాష్ట్రం రోహ్తక్ ప్రాంతానికి చెందిన మగన్ అలియాస్ అజయ్ అనే యువకుడి విషాదాంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భార్య దివ్య, ఆమె ప్రియుడు దీపక్ వల్ల తాను తీవ్రంగా మానసికంగా కుంగిపోయానని చెప్పిన మగన్.. చివరికి జీవితాన్ని వదిలేశాడు. ఈ స్టోరీలో ఏం జరిగిందో తెలుసుకుంటే మగాళ్లకు ప్రత్యేక చట్టం అవసరమా అనే సంకేతాలు కనిపిస్తున్నాయని సోషల్ మీడియా కోడై కూస్తోంది.
ఆ వీడియోలో ఏముంది?
ఆత్మహత్యకు ముందు అతడు రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియోలో చెప్పిన మాటలు ఎంతగానో కలిచివేస్తున్నాయి. నా భార్య పోలీస్ అధికారి దీపక్‌తో సన్నిహితంగా ఉంది. ఆ వీడియోను నాకు పంపించి నన్ను వేధిస్తోంది. మా నాన్నను చంపి ఆస్తి అమ్మి డబ్బు ఇవ్వమంటున్నారని కన్నీటి గళంతో వాపోయాడు. తన దగ్గర ఉన్న బ్రేస్ లెట్ అమ్మేశానని, తానే సాగు చేసిన ధాన్యాన్ని అమ్మి దాదాపు రూ.3.5 లక్షలు ఇచ్చినట్టు చెప్పాడు. అయినా ఇంకా రూ.1.5 లక్షలు డిమాండ్ చేస్తున్నారని వెల్లడించాడు.
తన పిల్లవాడి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ, నాకు ఏం జరిగినా నా కొడుకు తల్లి వద్ద కాక తాతమ్మ వద్ద ఉండాలని చెప్పాడు. వీడియోలో స్పష్టంగా నన్ను నేను చంపుకుంటున్నాను, కానీ ఇది నా తప్పు కాదు అన్న మాట గట్టిగా వినిపించాడు. మగన్ ఆవేదనలో చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరినీ ఆలోచించేట్టు చేశాయి. ఒక అమ్మాయి ఏడుస్తే న్యాయం ఆమెదే అవుతుంది. కానీ మగవాళ్లకేం న్యాయం లేదు. మగవారిని రక్షించే చట్టాలు కూడా ఉండాలి అంటూ తీవ్ర ఆవేదనతో తన భావాలు పంచుకున్నాడు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మగన్ సెల్ఫీ వీడియోను ఆధారంగా తీసుకుని దివ్య, దీపక్‌లపై కేసు నమోదు చేసే దిశగా ఉన్నారు. అయితే ఇది ఒక్క రోహ్తక్‌లో జరిగిన సంఘటన మాత్రమే కాదు. ఇది దేశవ్యాప్తంగా మగవారు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, కుటుంబ సమస్యలు, న్యాయ అసమానతలకు నిదర్శనం. ఒక వ్యక్తి చనిపోయేంత వరకు ఎదురయ్యే అవమానాలను మనం గుర్తించకపోతే.. ఇది సమాజంగా మన వైఫల్యమే అంటున్నారు కొందరు నెటిజన్స్.
సామాజిక మాధ్యమాల్లో ఈ సంఘటనపై కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇది ఒక్క మగన్ బాధ మాత్రమే కాదు, మగవారికి న్యాయం జరగాలంటే ప్రత్యేక చట్టాలు అవసరం అంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. చట్టాలు లైంగికత ఆధారంగా కాకుండా, బాధితుని స్థితిని బట్టి ఉండాలని చెబుతున్నారు. ఎవరైనా తప్పు చేస్తే శిక్ష ఉండాలి. కానీ మగవారు అన్నందుకే న్యాయానికి తక్కువగా లెక్కపెట్టడం సరికాదు అన్నదే ఈ సంఘటన నుండి తేలిన మెసేజ్ గా అభివర్ణిస్తున్నారు.
ఈ ఘటన మనలో ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. న్యాయ వ్యవస్థ మగవారి కోణంలో కూడా చూడాల్సిన సమయం ఇది. మగన్ జీవితాన్ని కాపాడలేకపోయాం.. కనీసం అతడి మాటల ద్వారా భవిష్యత్తులో ఇంకెవరూ అదే దారిలో వెళ్లకుండా జాగ్రత్త పడాలన్నది కొందరి మాట. మగన్ చివరిగా చెప్పిన మాట.. నా జీవితం ముగిసింది, కానీ మిగిలిన వాళ్లది ఆగకూడదనే భావనను చాటుతుంది. ఇది సెల్ఫీ వీడియో కాదు.. సమాజానికి ఒక హెచ్చరిక అంటున్నారు భార్యా భాదితులు.
"So many laws are there for women. But nothing is there for Men. I am dying by suicide because of torture by my wife Divya & her lover Deepak.
Only child of my parents will be gone. I request authorities to give my child to my parents & book these two people for my Murder"… pic.twitter.com/1USFNPVxAB
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) June 23, 2025