E-Paper
Advertisement

భీంగల్‌లో ఘోర విషాదం.. నీటికుంటలో మునిగి ముగ్గురు చిన్నారుల దుర్మరణం!

భీంగల్‌లో ఘోర విషాదం.. నీటికుంటలో మునిగి ముగ్గురు చిన్నారుల దుర్మరణం!
Advertisement

Nizamabad: నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. లింబాద్రిగుట్ట గ్రామంలోని వడ్డెర కాలనీకి చెందిన ముగ్గురు అమాయక చిన్నారులు నీటికుంటలో మునిగి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా అందరినీ కలచివేసింది. ఈ ఘటనతో ఆయా కుటుంబాల్లో పెను శోకం అలుముకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… కాలనీకి చెందిన హరీశ్‌ (11), అరవింద్‌ (10), వర్షిణి (6) అనే ముగ్గురు పిల్లలు ఆదివారం సరదాగా స్నానం చేద్దామని సమీపంలో ఉన్న నీటికుంట వద్దకు వెళ్లారు. అయితే, ఆ కుంట లోతును అంచనా వేయలేక, ఒకరినొకరు కాపాడుకునే క్రమంలో ప్రమాదవశాత్తు ముగ్గురూ అందులో మునిగిపోయారు.

Advertisement

పిల్లలు ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు కలిసి వెతకడం ప్రారంభించారు. నీటికుంట వద్ద వారి దుస్తులు, చెప్పులు కనిపించడంతో అనుమానం వచ్చి నీటిలో వెతికారు. అప్పటికే ఊపిరాడక పిల్లలు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని, స్థానికుల సహాయంతో మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: కాంగ్రెస్ హయాంలోనే ఆర్థిక వ్యవస్థ నాశనమైంది.. కేంద్ర మంత్రి విమర్శలు

Advertisement

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×