E-Paper
Advertisement

Parakamani Case CI: పరకామణి కేసులో ఫిర్యాదుదారుడు సీఐ అనుమానాస్పద మృతి.. హత్యా? ఆత్మహత్యా?

Parakamani Case CI: పరకామణి కేసులో ఫిర్యాదుదారుడు సీఐ అనుమానాస్పద మృతి.. హత్యా? ఆత్మహత్యా?
Advertisement

Parakamani Case CI: తిరుమల పరకామణి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న సీఐ సతీష్ కుమార్ మృతి చెందారు. సీఐ సతీష్ కుమార్ మృతదేహాన్ని డీఐజీ షిమోషి, ఎస్పీ జగదీష్ పరిశీలించారు. తాడిపత్రి నియోజకవర్గం జూటూరు-కోమలి గ్రామాల మధ్య రైల్వే ట్రాక్ పక్కన సీఐ సతీష్ కుమార్ విగతజీవిగా పడి ఉన్నారు. సీఐ సతీష్ కుమార్ ది హత్యా?.. ఆత్మహత్యా? అన్న కోణంలో విచారణ చేపట్టారు. సతీష్ ప్రస్తుతం గుంతకల్లు రైల్వే రిజర్వ్ ఇన్స్ పెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

పరకామణి చోరీలో రవికుమార్‌ను సీఐగా ఉన్నప్పుడు సతీష్‌ కుమార్ అరెస్టు చేశారు. అనంతరం కేసు నమోదు చేశారు. ఆ తర్వాత లోక్‌ అదాలత్‌ ద్వారా కేసు రాజీ కుదుర్చుకున్నారు. పరకామణి ఫిర్యాదుపై కేసు నమోదు చేసినప్పటికీ, అప్పట్లో రాజకీయ నాయకులు, టీటీడీ ఉన్నతాధికారుల ఒత్తిళ్లతో కోర్టులో సతీష్ కుమార్ కేసును రాజీ చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ రాజీపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో, కేసును సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ బృందం దర్యాప్తు చేస్తోంది.

సీఐడీ దర్యాప్తు

Advertisement

సీఐడీ దర్యాప్తు కీలక దశలో ఉన్న సమయంలో, కేసును రాజీ చేసుకున్న కీలక వ్యక్తి సతీశ్‌ కుమార్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సీఐ మృతికి గల కారణాలు, ఈ ఘటనకు పరకామణి కేసు దర్యాప్తుతో ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పరకామణి చోరీ కేసులో ఈ నెల 6న సతీష్‌ కుమార్‌ సీఐడీ అధికారులు విచారించారు. అనంతరం మరోసారి విచారణకు రావాలని సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఇంతలో ఆయన అనుమానాస్పద మృతి సంచలనం సృష్టిస్తోంది.

Also Read: Pune Accident: పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం: 8 మంది మృతి

చోరీ చేసిన వ్యక్తితో రాజీ?

Advertisement

టీటీడీ పరకామణి చోరీ కేసు వెలుగులోకి రావడానికి సీఐ సతీష్‌ కుమార్‌ కీలక పాత్ర వహించారు. ఏప్రిల్‌ 2023లో టీటీడీ సీనియర్‌ అసిస్టెంట్‌ రవికుమార్‌పై సతీష్‌ కుమార్‌ ఫిర్యాదు చేశారు. హుండీ ఆదాయం లెక్కింపు సమయంలో రవికుమార్‌ నగదు చోరీ చేసినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. సతీష్ కుమార్ ఫిర్యాదుతో రవికుమార్ పై కేసు నమోదైంది. దీంతో ఈ కేసులో సతీష్‌ కుమార్‌ ప్రధాన సాక్షిగా మారారు. ఆ తర్వాత రవికుమార్ తో టీటీడీ లోక్ అదాలత్ లో రాజీ చేసుకుంది. దొంగతనం చేసిన వ్యక్తితో రాజీ ఎలా చేసుకుంటారని పలువురు హైకోర్టును ఆశ్రయించడంతో.. ఈ కేసును మళ్లీ విచారించాలని కోర్టు సీఐడీని ఆదేశించింది.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×