E-Paper
Advertisement

Bengaluru City: బెంగుళూరు సమీపంలో.. టూరిస్ట్ బస్సులో మంటలు, స్పాట్‌లో 40 మంది ప్రయాణికులు

Bengaluru City: బెంగుళూరు సమీపంలో.. టూరిస్ట్ బస్సులో మంటలు, స్పాట్‌లో 40 మంది ప్రయాణికులు
Advertisement

Bengaluru City: బెంగుళూరు సమీపంలోని శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ట్రావెల్ బస్సు విద్యుత్ స్థంబాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బస్సు కాలి బూడిదైంది. ఘటన సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నారు. అసలు ఘటన ఎలా జరిగింది?

బెంగుళూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. అతి వేగం, డ్రైవర నిర్లక్ష్యం ఇలా రకరకాల కారణాలు లేకపోలేదు. దీనికితోడు విద్యుత్ వాహనాలు కూడా తోడయ్యాయి. ఆ విషయాన్ని కాసేపు పక్కనబెడదాం. తాజాగా శుక్రవారం వేకువజామున బెంగుళూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

నెలమంగళలో టూరిస్టు బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అతివేగంగా వెళ్తున్న బస్సు, నేరుగా విద్యుత్ వాహనాన్ని ఢీ కొట్టింది. ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత బస్సుని మంటలు చుట్టుముట్టాయి. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. వారి వస్తువులన్నీ అగ్ని ఆహుతయ్యాయి.

Advertisement

టూరిస్ట్ బస్సులో మంటలు, 40 మంది ప్రయాణికులు సేఫ్

బెంగళూరు-తుమకూరు 48వ జాతీయ రహదారిలోని హనుమంతపుర గేట్ సమీపంలో ఈ సంఘటన జరిగింది. సంజన ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు కాలిపోయింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు బెంగళూరు నుండి కలబురగి వెళ్తోంది. రోడ్డుపై నున్న చిన్న గుంతను తప్పించబోయి ఎదురుగా ఉన్న విద్యుత్ స్థంబాన్ని డ్రైవర్ ఢీ కొన్నట్లు చెబుతున్నారు.

తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ప్రమాదం జరిగింది. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత పోలీసులు కాలిపోయిన వాహనాన్ని పక్కకు తొలగించారు. ఘటన నేపథ్యంలో ఆ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు జోక్యం చేసుకుని ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. ఈ ఘటన గురించి మరింత సమాచారం తెలియాల్సివుంది.

ALSO READ: ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సులో మంటలు.. స్పాట్‌లో 29 మంది

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×