Chinese youth: టెక్ యుగంలో మనిషి జీవన విధానం మారిపోయింది. క్షణ తీరక లేకుండా కాలం గడుపుతున్నాడు. అనేక రకాల ఆనందాలకు దూరమవుతున్నాయి. ఇలాంటి గమనించిన కొందరు తమ వ్యాపారంగా మలచుకుంటున్నారు. అలాంటి వాటిలో వీపు గోకుడు వ్యాపారం ఒకటి. ఇదేం వ్యాపారం అనుకుంటున్నారా? చైనా యువకుడు దీని ద్వారా నెలకు లక్షలకు లక్షలు పోగేస్తున్నాడు. చైనా వ్యాప్తంగా విస్తరించాలనే ఆలోచన చేస్తున్నాడు. తొలుత సర్వీస్‌గా పెట్టి ఆ తర్వాత వ్యాపార సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశాడు 32 ఏళ్ల చైనా యువకుడు.
చైనాలోని షెన్‌జెన్ ప్రాంతానికి 32 ఏళ్ల ఝాంగ్ తన ఐడియాతో అతడి వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. దానికి ఏ మాత్రం పోటీ కూడా లేదు. శరీర దురదను తగ్గించడానికి గోకుడు వ్యాపారం. ఇదేదో వినడానికి విచిత్రంగా ఉన్నా, ముమ్మాటికీ నిజం. ఇచ్ స్క్రాచింగ్ ప్రాఫిటబుల్ బిజినెస్‌గా మార్చేశాడు. రెండు అవుట్‌లెట్ల ద్వారా నెలకు రూ. 14 లక్షలు సంపాదిస్తున్నాడు. షెన్‌జెన్‌లోని బావోవాన్, ఫుటియాన్ జిల్లాలో మరో రెండు స్టోర్లు ఉన్నాయి. తన వ్యాపారాన్ని చైనా వ్యాప్తంగా 100 అవుట్‌లెట్లకు విస్తరించాలని ప్లాన్ చేస్తున్నాడట. ఆధునిక జీవితంలో ఒంటరి తనం, చేతులు అందక ఇబ్బంది పడేవారికి బిగ్ రిలీఫ్. వీపు భాగాలపై దురద తీర్చుకోవడానికి ఇదొక మంచి సర్వీసుగా అతడి కస్టమర్లు చెబుతున్నారు. ఈ వ్యాపారానికి రోజు రోజుకూ ప్రజల నుంచి మాంచి ఆదరణ లభిస్తోంది.
గోకుడు సేవ పొందేందుకు గంటకు దాదాపు 300 యువాన్లు. అంటే భారత్ కరెన్సీలో అక్షరాలా రూ. 3,500 నుంచి మొదలవుతుంది. మసాజ్‌ల కంటే వీపు దురదను గోకుడు ద్వారా తగ్గించడం వల్ల ఒత్తిడిని తగ్గించి గాఢ నిద్ర పట్టేందుకు సహాయ పడుతుందని అంటున్నారు కస్టమర్లు. ఈ సేవలను అందుకున్నవారిలో 70 శాతం వరకు పురుషులు ఉంటున్నారని ఝాంగ్ మాట. విభిన్నమైన అనుభూతి కారణంగా రిపీటెడ్ కస్టమర్లు తమ వద్దకు వచ్చేవారు ఎక్కువగా ఉన్నట్లు తెలిపాడు.
మసాజ్ సెంటర్ల మాదిరిగా కస్టమర్లు బెడ్‌పై పడుకుంటారు. గోకుడు ప్రత్యేకంగా రూపొందించిన గోళ్లతో అక్కడున్న సిబ్బంది శరీర భాగాలను సున్నితంగా గోకుతారు. అది వినియోగదారుల మానసిక ఒత్తిడిని తగ్గించి, నిద్ర పట్టడానికి సహాయ పడుతుంది. ఈ ఆలోచన ఎవరిది? చిన్నతనంలో తన తండ్రి తనకు గోకిన అనుభూతిని గుర్తు చేసుకుని ఈ వ్యాపారం ప్రారంభించినట్టు చెప్పాడు ఝాంగ్ ప్రస్తుతం చాలామంది ఒంటరిగా ఉండడం, ఇలాంటి చిన్న ఆనందానికి దూరమవుతున్నారని గ్రహించి, దాన్ని వ్యాపార ఆలోచనగా మార్చాడు 32 ఏళ్ల యువకుడు.
ALSO READ: విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన
30 ఏళ్లు నిండకముందు ఇతడు సరిహద్దుల మధ్య జరిగే ఇ-కామర్స్ రంగంలో రెండు కంపెనీలను స్థాపించాడు. ఆ రెండు సక్సెస్ కావడానికి చాలా కష్టపడ్డాడు. రెండేళ్ల కిందట వెబ్-మీడియా రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడా చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపలేకపోయాడు. చిన్న వీడియోలను చూస్తుండగా ఓ మహిళ తన భర్త వీపు గోకుతున్న క్లిప్ అతనికి కనిపించింది. తమకు ఎవరైనా అలా చేస్తే డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని చాలామంది కింద కామెంట్స్ చేయడం గమనించాడు.