Bus Fire Accident: రాజస్థాన్ లోని జైసల్మేర్‌లో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తైయాట్ ప్రాంతంలోని మిలటరీ స్టేషన్ పరిధిలో కదులుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సులో.. అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 15 మంది సజీవ దహనం కాగా.. మరో 25 మందికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు జైసల్మేర్ నుండి మధ్యాహ్నం 3 గంటల సమయంలో.. 57 మంది ప్రయాణికులతో బయలుదేరింది. థైయత్ గ్రామం దాటిన కొద్దిసేపటికే, వాహనం వెనుక నుండి పొగలు వ్యాపించాయి. కొద్ది క్షణాల్లోనే బస్సు మొత్తం మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో ముగ్గురు పిల్లలు, నలుగురు మహిళలతో సహా 15 మంది గాయపడ్డారు. మరో 25 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో బస్సు మొత్తం పూర్తిగా దగ్ధం అయ్యింది.
Also Read: అక్టోబర్ 30న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం.. ఆర్జిత సేవలు రద్దు!
బస్సులో ఉన్న చిక్కుకున్న వారంతా ఒక్కసారిగా భయంతో కేకలు వేశారు. పలువురు ప్రయాణికులు కిటికీలు పగలగొట్టి బయటకు దూకారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి ఫైర్ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకొని.. మంటలను అదుపు చేశారు. అయితే బస్సులో మంటలు వ్యాపించడానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బస్సు ఇంజన్ లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చేలరేగాయా లేదా మరేదైనా కారణమా అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.