Army Major: రాజస్థాన్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని జైసల్మేర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుంటూరుకు చెందిన మేజర్ భరద్వాజ మరణించారు. ఆర్మీ మేజర్ టీ.సీ భరద్వాజ అకాల మరణం గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
వివరాల ప్రకారం.. ఆర్మీ విన్యాసాల్లో చురుగ్గా పాల్గొన్న మేజర్ భరద్వాజ, విన్యాసాలు ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. రాజస్థాన్‌లోని రామ్ గఢ్ – లాంగేవాలా మధ్యలోని గామ్నేవాలా గ్రామ సమీపంలో వారు ప్రయాణిస్తున్న ఆర్మీ జీప్ అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో జీప్ అత్యంత వేగంగా ఉన్నట్లు తెలుస్తోంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో జీప్ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మేజర్ టీ.సీ భరద్వాజ తీవ్రంగా గాయపడ్డారు.
ALSO READ: Kalvakuntla Kavitha: కవితను అడ్డుకున్న పోలీసులు.. చిక్కడపల్లిలో హై టెన్షన్
ప్రమాదం జరిగిన వెంటనే సహచర సిబ్బంది అప్రమత్తమై ఆయనను హుటాహుటిన సమీపంలోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందించినప్పటికీ, తీవ్ర గాయాల కారణంగా మేజర్ భరద్వాజ తుది శ్వాస విడిచారు. దేశ సేవలో నిత్యం ముందుండే ఓ ధైర్యవంతుడైన ఆర్మీ మేజర్ ఈ విధంగా ప్రమాదవశాత్తు మరణించడం దేశానికీ గుంటూరు జిల్లాకీ తీరని లోటు. భరద్వాజ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆయన మరణవార్త తెలుసుకున్న జిల్లా ప్రజలు, ఆర్మీ అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే భరద్వాజ సేవలను అధికారులు గుర్తు చేసుకున్నారు.
ALSO READ: Bus Fire Accident: అయ్యో ఎంత ఘోరం! కదులుతున్న బస్సులో చెలరేగిన మంటలు.. 15 మంది సజీవ దహనం