E-Paper
Advertisement

Gun misfire: నంద్యాల జిల్లాలో తీవ్ర విషాదం.. గన్ మిస్ ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి

Gun misfire: నంద్యాల జిల్లాలో  తీవ్ర విషాదం.. గన్ మిస్ ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి
Advertisement

Gun misfire: నంద్యాల జిల్లా డోన్ రైల్వే పోలీస్ స్టేషన్ (GRP) పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఒక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో భాగంగా తుపాకీని అప్పగించే క్రమంలో ప్రమాదవశాత్తు అది పేలడంతో హెడ్ కానిస్టేబుల్ పెద్దయ్య ప్రాణాలు కోల్పోయారు. ఈ హఠాత్పరిణామంతో రైల్వే పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది.

వివరాల్లోకి వెళ్తే.. హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న పెద్దయ్య, తన డ్యూటీ ముగించుకుని తెల్లవారుజామున ఆయుధాన్ని తిరిగి హ్యాండోవర్ చేయడానికి సిద్ధమయ్యారు. ఆ సమయంలో గన్ అన్‌లోడ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా తూటా పేలి ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న ఆయన్ను గమనించిన తోటి సిబ్బంది వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది.

Advertisement

ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గన్ ఏ విధంగా మిస్ ఫైర్ అయింది? సాంకేతిక లోపమా లేక అజాగ్రత్త వల్ల జరిగిందా? అనే కోణంలో విచారణ చేపట్టారు. ఆయుధాలను హ్యాండోవర్ చేసే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రాథమికంగా ఆరా తీస్తున్నారు. క్లూస్ టీమ్ కూడా ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించింది.

Also Read: భారీ అగ్ని ప్రమాదం.. అపార్ట్‌మెంట్‌లో పేలిన ఏసీ.. ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు

Advertisement

విధి నిర్వహణలో ఉన్న తోటి ఉద్యోగి ఇలా మరణించడంతో డోన్ పోలీస్ శాఖలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుడు పెద్దయ్య నిబద్ధత గల అధికారిగా పేరు తెచ్చుకున్నారని సహచరులు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×