E-Paper
Advertisement

Lovers Jump Pizza Shop: హిందూ సంఘం సభ్యుల వేధింపులు.. భయపడిన లవర్స్.. రెండో అంతస్తులో

Lovers Jump Pizza Shop: హిందూ సంఘం సభ్యుల వేధింపులు.. భయపడిన లవర్స్.. రెండో అంతస్తులో
Advertisement

Lovers Jump Pizza Shop: కారణాలు ఏమైనా కావచ్చు.. హిందూ సంఘాల సభ్యులు తమను వేధిస్తారని భయపడ్డారు లవర్స్. ఆ తర్వాత పిజ్జా షాపులోని రెండో అంతస్తు నుంచి కిందకు దూసేశారు. ఈ ఘటనలో ఆ జంటకు తీవ్రగాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అసలు ఏం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్లే..

యూపీలో దారుణం.. హిందూ సంఘం సభ్యుల వేధింపులు

Advertisement

యూపీలోని షాజహాన్‌పూర్ జిల్లా బరేలీ మోర్ సమీపంలోని శనివారం సాయంత్రం పిజ్జా షాపులో ఈ ఘటన జరిగింది. రెండో అంతస్తు నుంచి ఒక్కసారిగా లవర్స్ దూకేశారు. ఓ హిందూ సంఘం సభ్యుల వేధింపుల వల్ల ఇలా జరిగిందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఓ పిజ్జా షాపులోని రెండో అంతస్తులో కూర్చుని  యువతీ యవకుల జంట మాట్లాడుకుంటున్నారు. యువకుడి వయస్సు 21 ఏళ్లు కాగా, యువతి 19 ఏళ్లు ఉన్నాయి. అదే సమయంలో అక్కడికి ఒక హిందూ సంస్థ సభ్యులు చేరుకున్నారు. ఆ జంటను ప్రశ్నలతో వేధించడం మొదలుపెట్టారు. తాము ఇన్‌స్టంట్ నూడుల్స్ ఆర్డర్ చేశామని, దాని కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు.

Advertisement

భయపడిన లవర్స్.. పిజ్జా షాపు రెండో అంతస్తు నుంచి కిందకి దూకేశారు

ఆ తర్వాత వారి కులాల గురించి ఆయా సభ్యులు అడిగారట. వారిద్దరు తాము హిందువులమని చెప్పారు. కొందరి వీరిని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించడం మొదలుపెట్టారు. ఫోన్ తో చిత్రీకరణపై వారి మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు లోనైయ్యారు లవర్స్.. తమ పరువు పోతుందని భావించారు.

భయంతో రెండో అంతస్తులోని కిటికీలోంచి కిందకు దూకేశాడు. అతడితో పాటు యువతి కూడా కిందకు దూకిందని పోలీసు వర్గాలు తెలిపాయి. భవనం పైనుంచి కింద పడటంతో ఆ జంటకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ALSO READ: బీజేపీ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే దారుణం.. బట్టలు విప్పి మూత్రం పోసి.. వీడియో కాల్‌లో చూస్తూనే..?

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విచారణ మొదలుపెట్టారు పోలీసులు. ఆయా సంఘం సభ్యులతో కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని జిల్లా ఎస్పీ తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని యువతీయువకులను వేధించే హక్కు ఎవరికీ లేదన్నారు.

Related News

అయోధ్య రామమందిరం కేసులో సంచలనం.. 105 సార్లు విరాళాల చోరీ.. బయటపెట్టిన సిట్!

యువతి యువకుడిపై దాడి.. అసభ్యకరంగా మాటలు, బీహార్‌లో ఘటన, వీడియో వైరల్

చచ్చిపోయిన లండన్‌కు సీఎం విజయ్ ఎందుకు.. మధురై వెళ్లాలని అన్నామలై ఘాటు వ్యాఖ్యలు

భూ కేసులో హేమంత్ సోరెన్‌కు షాక్.. నేడు PMLA కోర్టులో కీలక విచారణ!

రైతులను నెలకు రూ.3 వేలు పెన్షన్.. ఆ స్కీమ్ గురించి తెలుసా, వెంటనే అప్లై చేయండి?

రోడ్డుపై BMW బీభత్సం, స్పాట్‌లో ముగ్గురు మృతి, ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం

లాల్‌బాగ్ గణేష్ మండపం వద్ద ఘోర విషాదం.. చిన్నారితో సహా ఇద్దరు భక్తులు దుర్మరణం

భార్య ప్రైవేట్ పార్ట్స్ కొరికితే.. భర్త ముక్కు కొరికేశాడు, యూపీలో విచిత్రమైన ఘటన

Big Stories

Advertisement
×