Telangana road accident: అతివేగం ఇద్దర్ని మింగేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. కరీంనగర్- జగిత్యాల రహదారి ధరూర్ వద్ద ఈ తెల్లవారుజామున ప్రమాదం జరిగింది.
జగిత్యాల డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సును, వేగంగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు మృతి చెందారు. ప్రమాదం సమయంలో కారులో నలుగురు ప్రయాణిస్తున్నారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
సంకీర్త్ తన పేరెంట్స్‌తో కలిసి జనగామకు పెళ్లి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వారంతా జగిత్యాలకు చెందిన వారు. మృతి చెందిన యువతి సంకీర్త్‌కు బంధువు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
వాహనాలను పక్కకు తొలిగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. మృతదేహాలను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు గురైన జగిత్యాల ఆర్టీసీ డిపోకు చెందిన బస్సుకు ముందు టైరు ఊడి పోయి ఉంది. టైరు ఊడిపోయి ప్రమాదం జరిగిందా? లేక ఢీకొట్టిన సమయంలో టైరు ఊడిపోయిందా అనేది తెలియరాలేదు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.