BigTV English

Love languages: ప్రపంచంలో ఎన్ని రకాల ప్రేమ భాషలు ఉన్నాయో తెలుసా? వీటిలో మీ లాంగ్వేజ్ ఏమిటీ?

Love languages: ప్రపంచంలో ఎన్ని రకాల ప్రేమ భాషలు ఉన్నాయో తెలుసా? వీటిలో మీ లాంగ్వేజ్ ఏమిటీ?

ప్రేమ భాషల గురించి మీరు వినే ఉంటారు. ప్రేమికులు వాడే కమ్యూనికేషన్‌ని ప్రేమ భాష అంటారు. ఒక్కొక్కరు ఒక్కోలా తమ ప్రేమను వ్యక్తీకరిస్తారు. కొంతమంది పదాల్లో చెబితే మరి కొందరు స్పర్శతో చెబుతారు. మరికొందరు తమ పనుల ద్వారా చెబుతారు. ఇవన్నీ కూడా ప్రేమ భాషల్లో రకాలే. మీరు ప్రేమించే వ్యక్తులు పట్ల చూపించే ఆప్యాయత కూడా ఒక ప్రేమ భాష. ఒక్కో వ్యక్తి ఒక్కోలా తమ ప్రేమను వ్యక్తీకరిస్తారు. తమ ప్రేమను కమ్యూనికేట్ చేస్తారు. ఇవన్నీ ప్రేమ భాషల్లోకి వస్తాయి.


అయిదు ప్రేమ భాషలు
ప్రపంచంలో ఎన్ని రకాల ప్రేమ భాషలు ఉన్నాయో తెలుసుకోవడం కోసం అధ్యయనాలు జరిగాయి. ఇప్పటివరకు ఐదు రకాల ప్రేమ భాషలు ఉన్నట్టు అధ్యయనం తేల్చింది. అయితే కొత్తగా చేసిన మరొక అధ్యయనంలో ఏడుప్రేమ భాషలు ఉన్నాయని తెలుస్తోంది. ఒక్కో మనిషి ఒక్కోలా ఈ ప్రేమ భాషలను వినియోగిస్తారు. తమ ప్రేమను ఎదుటి వ్యక్తికి తెలియజేయడమే వారి ముఖ్య ఉద్దేశం.

మాటలతో చెప్పడం
కొంతమంది తమ ప్రేమను మాటల ద్వారానే వ్యక్తీకరిస్తారు. రకరకాల పొగడ్తలతో వారిని ప్రశంసిస్తారు. మౌఖికంగా వారిని ఉత్సాహపరిస్తారు. మెసేజుల రూపంలో వారికి తమ మనసులోని మాటను చెబుతారు. సోషల్ మీడియాలో కూడా అందమైన మెసేజులు పెట్టి డిజిటల్ కమ్యూనికేషన్‌ను వాడుకుంటారు. ఎలా చేసినా వారు పదాలతోనే తమ ప్రేమను వ్యక్తీకరిస్తారు. కాబట్టి ఇదొక రకమైన ప్రేమ భాషగా చెప్పుకోవచ్చు.


సమయాన్ని కేటాయించడం
ప్రేమించిన వ్యక్తి కోసం సమయాన్ని కేటాయించడం కూడా ప్రేమ భాష కిందే లెక్క. భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది వారు తమలోని ప్రేమను వ్యక్తీకరించడమే. అలాగే వారితో సమావేశం అవ్వడానికి వారితో మాట్లాడేందుకు ఇష్టపడుతూ ఉంటారు. వారిని మౌనంగానే ఆరాధిస్తూ ఉంటారు. ఎదుటివారు చెబుతున్నవి వినడానికి సమయాన్ని కేటాయిస్తారు. వారిని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ప్రేమించిన వ్యక్తికి సమయాన్ని కేటాయించడం వల్లే జరుగుతాయి. కాబట్టి ప్రేమ భాషల్లో ఈ సమయాన్ని ఇవ్వడం కూడా ఒకటి.

సేవ చేయడం
ప్రేమించిన వ్యక్తికి ఆరోగ్యం బాగోలేనప్పుడు లేక అవసరమైనప్పుడు కొన్ని రకాల పనులు చేయడం ద్వారా తమలోని ఇష్టాన్ని, ప్రేమను వ్యక్తీకరిస్తారు. వారు అనారోగ్యంగా ఉన్నప్పుడు వారికి కావలసిన ఆహారాలను వండి పెడతారు. ఉదయం పూట టీ, కాఫీలను అందిస్తారు. వారికి పనుల్లో సాయం చేస్తారు. ఇవన్నీ కూడా ప్రేమ భాష కిందకి వస్తాయి. వారు నోరు విప్పి నువ్వంటే ఇష్టమని చెప్పలేరు. కానీ వారికి ఇష్టమైన పనులన్నీ చేస్తూ ఉంటారు. వారిపై శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. చిన్న పనులు, పెద్ద పనులు అనే తేడా లేకుండా వారి జీవితాన్ని సులభతరం చేయడానికి ఆ పనులన్నీ తామే చేయడానికి సిద్ధమవుతారు. ఇది కూడా ఒక ప్రేమ భాష.

బహుమతులు ఇవ్వడం
నోటితో ప్రేమిస్తున్నానని చెప్పలేకపోయినా బహుమతి ఇవ్వడం ద్వారా కూడా ఆ విషయాన్ని చెప్పవచ్చు. తమలోని ప్రేమను వ్యక్తీకరించడానికి ఒక అందమైన బహుమతిని ఎంపిక చేసుకుని తరచూ వాటిని అందిస్తూ ఉంటారు. కొందరు ఖరీదైన బహుమతులు కొంటే మరికొందరు సింపుల్ బహుమతులని ఇస్తారు. అవి ప్రేమను ప్రతిబింబించేలా ఉంటాయి. ఇలా బహుమతులు ఇవ్వడం కూడా ఒక రకమైన ప్రేమ భాషేనని అధ్యయనం తెలిసింది. ఆ బహుమతి కూడా మీలోని ప్రేమను వ్యక్తీకరించేదిలా ఉంటుంది. అందుకే దీన్ని కూడా ప్రేమ భాష గాని లెక్కించారు.

అందమైన స్పర్శ
ప్రేమలో స్పర్శ ఎంతో ముఖ్యమైనది. ఏడుస్తున్నవారికి ఒక్క కౌగిలింత ఎంతో సాంత్వనగా ఉంటుంది. కాబట్టి శారీరక స్పర్శను తక్కువ అంచనా వేయకూడదు. కొందరు తమ ప్రేమను వ్యక్తీకరించడానికి కౌగిలింతలు, ముద్దుల ద్వారా చెబుతారు. ప్రేమ భాషల్లో భౌతిక స్పర్శ కూడా ఒకటి. అందులోనే సెక్స్ కూడా ఒక భాగంగా చేరిపోయింది. శారీరక సాన్నిహిత్యం అనేది ప్రేమలోని తీవ్రతను మరింత శక్తివంతంగా చెబుతుంది. ఆ ప్రేమ ఇద్దరి యువతీ యువకుల మధ్యే ఉండాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు కూడా తమ బిడ్డలను ఎంతో గట్టిగా హత్తుకుంటారు. తమ ప్రేమను అలా వ్యక్తీకరిస్తారు. కాబట్టి స్పర్శ కూడా ప్రేమ భాషల్లో ఒకటిగా మారిపోయింది.

అందరూ మాట్లాడే శక్తిని కలిగి ఉండకపోవచ్చు. కొంతమంది అంతర్ముఖులుగా ఉంటారు. వారు ప్రతి విషయాన్ని బయటకి చెప్పలేరు. అలాంటి వారే తమ పనులు, చేతల ద్వారా తమలోని ప్రేమను వ్యక్తీకరిస్తారు. బహుమతులు అందించడం ద్వారా కంటి చూపు ద్వారా, పనుల్లో సాయం చేయడం ద్వారా తమ మనసులోని మాటను చెబుతూ ఉంటారు. తమ ప్రేమను వ్యక్తీకరిస్తూ ఉంటారు. ఆ ప్రేమను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఎదుటి వ్యక్తితే.

Related News

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×