Ntr: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ లో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఒకటి. త్రివిక్రమ్ (Trivikram దర్శకత్వం వహించిన జులాయి సినిమాతో ఈ బ్యానర్ మొదలైంది. అయితే ఇప్పటివరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మినహాయిస్తే ఈ బ్యానర్ లో మరో దర్శకుడు పనిచేయలేదు. ఈ బ్యానర్ లో సూర్య దేవర నాగ వంశీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు చేపట్టేవారు. ఈ బ్యానర్ కి అనుసంధానంగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ని స్థాపించారు. ఈ బ్యానర్ లో నాగ వంశీ సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. ఎన్నో అద్భుతమైన హిట్ సినిమాలు ఇప్పటివరకు ఈ బ్యానర్ లో వచ్చాయి. ప్రస్తుతం ఈ బ్యానర్ మంచి ఫామ్ లో ఉంది. రీసెంట్ గా ఈ బ్యానర్ నుంచి లక్కీ భాస్కర్ అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
Also Read: Delhi Ganesh : సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ ఇక లేరు..
రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ నాగ వంశీ (Naga Vamsi) ని ఏ డైరెక్టర్ తో మీకు పని చేయాలని ఉంది అని అడిగినప్పుడు. నాకు నెల్సన్ తో పనిచేయాలని ఉంది అని చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం నెల్సన్ దర్శకుడిగా ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా తెరకెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరి ఇద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి నాగ వంశీ తను అనుకున్న పనిని కంప్లీట్ చేయబోతున్నాడు అని చెప్పాలి. ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.
Read More : Sumanth Prabhas : మేము ఫేమస్ తర్వాత 85 కథలు విన్నాను
డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొలమావు కోకిల సినిమాతో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు నెల్సన్. అయితే ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆ సినిమాలో యోగి బాబుని చూపించిన విధానం. నయనతార ను చూపించిన విధానం. ఆ కథ, స్క్రీన్ ప్లే, ఆ టైప్ ఆఫ్ కామెడీ ఇవన్నీ కూడా అప్పటి ప్రేక్షకులకి మంచి ఎక్స్పీరియన్స్ ని ఇచ్చాయి. ఇదే సినిమాను తెలుగులో కూడా కోకో కోకిల అనే పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా అద్భుతమైన హిట్ అయింది. ఈ సినిమా తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ చేసిన సినిమా వరుణ్ డాక్టర్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బీభత్సమైన విజయాన్ని సాధించింది. అసలు కామెడీని ఇలా కూడా చేయొచ్చు. అని తన పంథాలో కామెడీని చూపించి ఆ సినిమాను దాదాపు 100 కోట్లు మార్కు అందుకునేలా హిట్ చేశాడు నెల్సన్. అప్పటితో నెల్సన్ పైన అందరికీ అంచనాలు పెరిగిపోయాయి.ఇదే సినిమా తెలుగులో కూడా బీభత్సమైన విజయాన్ని సాధించింది.