Uttar Pradesh News: బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఆ తల్లి పడే నరకం అంతా ఇంతా కాదు. అలాంటి ఓ తల్లి పురిటి నొప్పులు భరించలేక ఏకంగా కత్తితో పొత్తి కడుపును కోసుకున్న ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చివరకు ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లాలో వెలుగు చూసింది.
పురిటి నొప్పులు భరించలేక.. కత్తితో పొత్తి కడుపు కోసుకున్న గర్భిణి
యూపీ బహ్రాయిచ్ జిల్లాలోని నంద్వాల్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. ప్రసవం సమయంలో నొప్పులు కాస్త ఎక్కువగా ఉంటాయి. వాటిని ఆ తల్లి భరించలేక పోయింది. చివరకు వంటింట్లో ఉపయోగించే కత్తితో పొత్తి కడుపుని కోసేసింది. దీంతో ఆ మహిళకు తీవ్ర రక్తస్రావమైంది.
ఆమె అరుపులు విన్న ఇరుగుపొరుగువారు వెంటనే అక్కడికి చేరుకుని ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు. సాధారణ ప్రసవం ద్వారా ఆడ శిశువుకు జన్మ నిచ్చింది ఆమె. ప్రసవం తర్వాత ఆ మహిళ ఆరోగ్యం క్షీణించింది. వెంటనే మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి మహిళ కుటుంబసభ్యులు తరలించారు.
యూపీలో దారుణం.. బేబీ సేఫ్, మహిళ ఆరోగ్యం విషమం
అక్కడి నుంచి లక్నోకు తరలించారు. ఆ మహిళ స్ట్రెచర్‌పై ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కత్తితో పొత్తి కడుపు కోసుకోవడం వల్ల తీవ్ర గాయమైనట్లు చెప్పారు డాక్టర్లు. ఆ మహిళ భర్త ఆరు నెలల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. ఇంట్లో ఆమె ఒంటరిగా నివాసం ఉంటోంది.
గురువారం మధ్యాహ్నం ఆమెకు ప్రసవ నొప్పి వచ్చినప్పుడు భరించలేనంతగా పెరిగిపోయిందని స్థానికులు చెప్పారు. ఆ క్రమంలో కూరగాయలు కోసేందుకు ఉపయోగించే కత్తితో పొత్తి కడుపును కోసిందని తెలిపారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
ALSO READ: టీవీ సౌండ్ తగ్గించాలన్నందుకు.. భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య!