BigTV English
Advertisement

Trump Assassination Plot: ట్రంప్ హత్యకు డబ్బులు ఇవ్వలేదని.. తల్లి దండ్రులను కాల్చి చంపిన 17ఏళ్ల కుర్రాడు

Trump Assassination Plot: ట్రంప్ హత్యకు డబ్బులు ఇవ్వలేదని.. తల్లి దండ్రులను కాల్చి చంపిన 17ఏళ్ల కుర్రాడు

Trump Assassination Plot: ట్రంప్‌ను హత్య చేసి, అమెరికా ప్రభుత్వాన్ని కూల్చేయాలనే కుట్రలో 17ఏళ్ల కుర్రాడు నికితా క్యాసప్.. తన తల్లిదండ్రులను అతి కిరాతకంగా హత్య చేశాడు. ట్రంప్‌ హత్యకు డబ్బులు ఇవ్వలేదని ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిసి అమెరికా అధికారులు ఉలిక్కిపడ్డారు. ఈ విషయాన్ని ఫెడరల్ వారెంట్‌లో పేర్కొన్నారు.


విస్కాన్సిన్‌లోని మిల్వాకీ ప్రాంతానికి చెందిన నికితా క్యాసప్.. విలాసాలకు అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో ఆర్థిక అవసరాలు, స్వేచ్చ కోసం ట్రంప్‌ హత్యకు కుట్ర పన్నాడు. హత్యకు కావాల్సిన డబ్బులు ఇవ్వలేదని ఫిబ్రవరి 11న తన తల్లి టటియానా, సవతి తండ్రి డొనాల్డ్‌ మేయర్‌ను తుపాకీతో కాల్చి చంపాడు. కొన్నివారాల పాటు వారి శవాలతోనే నివసించాడు. తర్వాత 14వేల డాలర్ల నగదు, పాస్‌పోర్ట్‌తో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. వాళ్ల ఇంటికి నుంచి దుర్వాసన వస్తుందని స్థానికులు ఫిర్యాదు చేయగా.. అసలు విషయం బయటపడింది.

దర్యాప్తు చేపట్టిన పోలీసులు కాన్సస్‌లో నిందితుడు నికితాను అరెస్ట్ చేశారు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డబ్బుకోసమే తల్లిదండ్రులను హత్య చేసినట్లు తెలిపాడు నికితా. ట్రంప్ హత్యకు కుట్ర గురించి తెలియడంతో.. తల్లిదండ్రులను హత్య చేసినట్లు విచారణలో తేలింది. తన వద్ద ఉన్న డబ్బుతో ఓ డ్రోన్, పేలుడు పదార్థాలు కొనుగోలు చేశాడు. ఓ రష్యా వ్యక్తితో కలిసి ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. టిక్‌టాక్, టెలిగ్రామ్‌ వంటి సోషల్ మీడియా యాప్‌ల్లో.. రష్యా వ్యక్తితో డీల్స్ కుదిర్చుకున్నాడు నికితా. ట్రంప్‌ను చంపి ఉక్రెయిన్ పారిపోవాలని ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు.


కాగా గత కొద్ది రోజుల క్రితం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపేస్తానంటూ.. ఓ వ్యక్తి యూట్యూబ్‌లో పలు వీడియోలు పోస్ట్ చేశాడు. అందులో తమ దారికి అడ్డుగా వచ్చిన ఏ ఒక్కడిని వదలను అంటూ పేర్కొన్నాడు. అంతే కాదండోయ్ ట్రంప్, ఎలాన్ మస్క్‌తో సహా ఇతర అధికారులను కూడా.. హతమారుస్తానంటూ ఆ వీడియోలో తెలిపాడు. ఈ తరుణంలో మార్చి 4న ట్రంప్‌ను హత్యచేస్తానంటూ మరో వీడియోను పోస్ట్ చేశాడు. ఈ బెదిరింపులు వీడియో ఎఫ్‌బీఐ అధికారులు దృష్టికి రావడంతో అతన్ని అరెస్ట్ చేశారు.

Also Read: డైమండ్ వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ అరెస్ట్.. రూ.13,500 కోట్లు, భారత్‌కు రప్పిస్తారా?

గతేడాది ట్రంప్‌పై అమెరికా ఎన్నికల ప్రచారంలో హత్య జరిగిన సంగతి తెలిసిందే. పెన్సిల్వేనియాలోని నిర్వహించిన కార్యక్రమంలో.. ట్రంప్ మాట్లాడుతుండగా ఓ భవనం నుంచి గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ట్రంప్ కుడివైపు చెవికి గాయమైన సంగతి తెలిసిందే. వెంటనే స్పందించిన అమెరికా సీక్రెట్ సర్వీస్ సిబ్బంది డొనాల్డ్ ట్రంప్‌ను కాపాడారు. అనంతరం దాడి చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించి..భద్రతా బలగాలతో కాల్పులు జరిపి అరెస్టు చేశారు. తాజాగా ట్రంప్‌ను హత్య చేయడం కోసం డబ్బులు ఇవ్వలేదని.. తల్లి దండ్రులను హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వరుసగా హత్యా యత్నాలు జరగడం ఇప్పుడు ట్రంప్ భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది.

Related News

Srisailam Road: శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.. మంటల్లో దగ్దమైన కారు.. స్పాట్‌లో 6గురు

Tirupati Crime: ఆ ఫ్యామిలీలో చిచ్చు.. విసిగిపోయిన ఆ తల్లి, పిల్లలతో కలిసి ఆత్మహత్య

Bus Accident: ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన తుఫాన్ వాహనం.. స్పాట్‌లో నలుగురు

Road Accident: పెళ్లి కారు టైరు పేలి‌.. ముగ్గురు స్పాట్‌డెడ్‌

Road Accident: డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. మంటల్లో తగలబడి.. 8 మంది స్పాట్!

Patancheru Tollgate: ఘోర రోడ్డు ప్రమాదం.. పటాన్‌చెరులో ట్యాంకర్‌ బోల్తా..

Hyderabad News: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్యాయత్నం.. అసలేం జరిగిందంటే..?

TMC MP Kalyan Banerjee: సైబర్ వలకు చిక్కిన ఎంపీ కళ్యాణ్ బెనర్జీ.. ₹55 లక్షల స్వాహా!

Big Stories

×