Joy Jemima Honey Trap Case: విశాఖ జాయ్ జమీమా హనీ ట్రాప్ కేసు సీరియల్ మాదిరిగా సాగుతోంది. దాదాపు మూడు నెలలు అరెస్టుల పర్వం కొనసాగుతోంది. లేటెస్ట్‌గా మరో ముగ్గుర్ని అరెస్టు చేశారు పోలీసులు. ఈ కేసులో తీగలాగితే డొంక కదులుతోంది.
ఆలోచనను పెట్టుబడిగా మార్చాలని చాలామంది వ్యాపారవేత్తలు అప్పుడప్పుడు చెబుతుంటారు. కానీ కనిపిస్తున్న హనీ ట్రాప్ మహిళ తన అందాన్ని పెట్టుబడిగా మార్చింది. సొసైటీలో పలుకుబడి, సంపన్నులను మాత్రమే టార్గెట్ చేసింది. ఆమె వేసిన ప్లాన్ మాదిరిగానే సక్సెస్ అయ్యింది. బ్లాక్ మెయిల్‌తో కోట్లాది రూపాయలు కొల్లగొట్టింది. చివరకు అసలు గుట్టు బయటపడి అడ్డంగా దొరికిపోయింది.
హైదరాబాద్‌కు చెందిన ఫాతిమా ఉస్మాన్ అలియాస్ జోయాతోపాటు ఆమె భర్త తన్వీర్, స్నేహితుడు అవినాష్ బెంజిమెన్‌లను అరెస్టు చేసినట్లు విశాఖ నగర సిపి శంకబ్రత భాగ్జి వెల్లడించారు. అక్కడి నుంచి విశాఖపట్నం తీసుకొచ్చి స్థానిక కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వారికి 15 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. వెంటనే విశాఖలోని సెంట్రల్ జైలుకి తరలించారు.
హనీ ట్రాప్ కేసు వ్యవహారంపై విశాఖలోని పలు పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. జాయ్ జమీమాతో లివింగ్ రిలేషన్‌లో ఉన్న బచ్చు వేణు భాస్కర్‌రెడ్డి, వేముల కిషోర్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు పోలీసులు. జమీమా కేసులో కీలక ముఠా సభ్యులుగా ఉన్న ముగ్గురు జ్యూసులలో మత్తుమందు, మత్తు స్ప్రేలను సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. హనీ ట్రాప్‌కి గురైన బాధితుల నుండి భారీగా డబ్బులు వసూలు చేయడంలో కీలకంగా వ్యవహరించేవారని గుర్తించారు.
ALSO READ: చెరువులో దూకి ఎస్సై, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య.. వీరితో పాటుగా మరో యువకుడు… అసలేమైంది.