E-Paper
Advertisement

Visakha Beach: అలలు తాకిడికి కొట్టుకుపోయిన ఇద్దరు విదేశీయులు.. ఒకరు మృతి, విశాఖలో ఘటన

Visakha Beach: అలలు తాకిడికి కొట్టుకుపోయిన ఇద్దరు విదేశీయులు.. ఒకరు మృతి, విశాఖలో ఘటన
Advertisement

Visakha Beach: విశాఖపట్నం తీరంలో విషాదం చోటు చేసుకుంది. నగరంలోని యారాడ బీచ్ లో బలమైన అలల తాకిడికి గురై ఇద్దరు పర్యాటకులు గల్లంతయ్యారు. ఈ దుర్ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. చుట్టుపక్కల పర్యాటకు సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పోలీసుల వివరాల ప్రకారం.. ఇటలీ దేశం నుంచి 16 మంది పర్యాటకులు ఇండియా టూర్ కు వచ్చారు. ఈ క్రమంలోనే ఈ రోజు విశాఖలోని యారాడ బీచ్‌ను వీదేశీ టూరిస్టులు సందర్శించారు. సరదాగా సముద్రంలోకి దిగిన ఈ ఇద్దరు పర్యాటకులను అకస్మాత్తుగా వచ్చిన పెద్ద అలలు లోపలికి లాక్కెళ్లాయి. గమనించిన లైఫ్ గార్డులు,  స్థానిక పర్యాటకులు వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. బీచ్ లో కొట్టుకుపోతున్న ఇద్దరినీ అతి కష్టం మీద రక్షించి ఒడ్డుకు తీసుకురాగలిగారు. అయితే, వారిలో ఒక విదేశీయుడి పరిస్థితి విషమంగా ఉండటంతో.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ.. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరణించిన వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కింగ్ జార్జ్ ఆసుపత్రి (KGH)కి తరలించారు.

Advertisement

ALSO READ: Rains: రాష్ట్రంలో కుండపోత వర్షాలు.. ఈ 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్, భారీ పిడుగులు పడే అవకాశం

ఘటనలో మరొక పర్యాటకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పర్యాటకులు ఎంతటి సరదా కోసం వచ్చినా, సముద్రంలోకి వెళ్లేటప్పుడు కాస్త జాగ్రత్తలు పాటించాలని, బీచ్ లో లోతుగా వెళ్లకూడదని అధికారులు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు. తీర ప్రాంతంలో అల్లకల్లోలంగా ఉన్నప్పుడు అలలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పర్యాటకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ విషాదం జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు.

Advertisement

ALSO READ: BEL Notification: బెల్ నుంచి భారీ నోటిఫికేషన్.. జీతం అక్షరాల రూ.40వేలు, దరఖాస్తుకు 2 రోజులే గడువు

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×