Viral video: ఈ రోజుల్లో సోషల్ మీడియా హవా మామూలుగా లేదు.. ప్రపంచంలో ఎక్కడేం జరిగినా క్షణాల్లో మన ముందు ఉంచుతోంది సోషల్ మీడియా.. ఇందులో ఎక్కువగా కామెడీ వీడియోలు, జంతువులకు సంబంధించిన వీడియో, పాములకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా వీటిని చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. తాజాగా ఓ నాలుగేళ్ల చిన్నారి భారత జాతీయ గీతాన్ని చాలా చక్కగా ఆలపించాడు. జనగణమన గీతాన్ని అమాయకత్వంతో.. హృదయపూర్వకంగా ఆలిపించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
?utm_source=ig_web_copy_link
జోష్ జెరెమయ్యా అనే నాలుగేళ్ల చిన్నారి భారత జాతీయ గీతం జన గణ మనను అమాయకత్వంతో, హృదయపూర్వకంగా ఆలపించాడు. చిన్న బాలుడు తన చిన్న చేతులతో.. తన చిన్న స్వరంతో జాతీయ గీతాన్ని ఆలపిస్తూ దేశభక్తిని చాటుకున్నాడు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లలో 5లక్షలకు కంటే ఎక్కువ వ్యూస్ సాధించింది. ఈ వీడియోలో జోష్ తన చిన్న గొంతుతో గీతాన్ని ఆలపిస్తూ కొన్ని చిన్న చిన్న పొరపాట్లతో సహా తన హృదయంలోని దేశభక్తిని అద్భుతంగా వ్యక్తం చేశాడు.
ALSO READ: Rains: రాష్ట్రంలో కుండపోత వర్షాలు.. ఈ 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్, భారీ పిడుగులు పడే అవకాశం
ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు జోష్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ‘ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప దేశభక్తి చూడటం ఆనందంగా ఉంది’ అని ఒకరు కామెంట్ చేయగా.. మరొకరు ఈ ‘ఆ బాలుడు జాతీయ గీతాన్ని ఎంత చక్కగా ఆలపించాడో.. వినడానికి చూడడానికి చాలా బాగుంది’ అని రాశారు. జోష్ తల్లిదండ్రులు అతనిలో ఇంత చిన్న వయసులోనే దేశభక్తిని నింపినందుకు చాలా మంది నెటిజన్లు ప్రశంసించారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు కూడా ఈ చిన్నారి హృదయపూర్వక ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు.
ALSO READ: Kadapa News: తండ్రిని బంధించి.. కన్న తల్లి గొంతుకోసి దారుణంగా చంపి, అనంతరం టీవీ చూస్తూ..?
జోష్ వీడియో క్యాప్షన్‌లో ఇలా రాశాడు.. ‘నాకు నాలుగేళ్లు మాత్రమే, నేను మన జాతీయ గీతం పాడటం ఇష్టపడతాను.. 2025 స్వాతంత్ర్య దినోత్సవం నాడు నా దేశ ప్రేమ మొదలైంది. అప్పటి నుండి నా ఉత్సాహం తగ్గలేదు. నా చిన్న పొరపాట్లను క్షమించండి.. ఇదంతా హృదయం నుంచి వచ్చింది’ ఈ సరళమైన, నిజాయితీ గల మాటలు ప్రతి ఒక్కరినీ కదిలించాయి. వీడియో చూస్తుంటే.. జోష్ అమాయకమైన ప్రదర్శన దేశం పట్ల నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో చూపించింది. అతని చిన్న గొంతులోని ఆ భావపూరిత ఆలాపన నిజమైన దేశభక్తి సారాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ వీడియో దేశం పట్ల ప్రేమను అమాయకత్వంతో, సరళతతో వ్యక్తం చేయడం ఎంత శక్తివంతమైనదో నిరూపించింది. ఫైనల్ గా ఈ చిన్నారి జోష్ ఈ చిన్న ప్రయత్నం భారతదేశంలోని అనేక మంది హృదయాలను గెలుచుకుంది.