Crime News : 62 ఏళ్లు దేవేంద్రరామ్ ఓ రిటైర్డ్ ఉద్యోగి. 55 ఏళ్ల అతని భార్య మాయ ఓ కామ పిశాచి. షష్టి పూర్తి వయస్సులోనూ ఆమెకు ఆ తాపం తీరలేదు. 30 ఏళ్ల ఏజ్ ఉండే ముగ్గురు యువకులతో ఎఫైర్ పెట్టుకుంది. భర్తకు తెలీకుండా వారితో చాటుమాటు యవ్వారం జోరుగా సాగిస్తోంది. అయినా, ఫుల్ టైమ్ ఎంజాయ్‌మెంట్‌కు మొగుడు అడ్డుగా ఉన్నాడని భావించింది. తన ముగ్గురు యంగ్ లవర్స్‌తో కలిసి భర్తను దారుణంగా నరిచి చంపింది ఆ ముసలి పెళ్లాం.
ముగ్గురు యువకులతో ఎఫైర్
దేవేంద్ర, మాయలది అందమైన కుటుంబం. ఇద్దరు పిల్లలు. 2013లో ఓ ప్రముఖ సంస్థ నుంచి రిటైర్డ్ అయ్యారు. ఓ ఇల్లు కట్టుకున్నారు. అయితే, దేవేంద్ర తరుచూ తన తల్లిదండ్రులు ఉండే గ్రామానికి వెళ్లేవాడు. కొన్ని రోజులు స్వగ్రామంలో గడిపి వచ్చేవాడు. భర్త లేకుండా ఒంటరిగా ఫీల్ అయిన మాయ.. ఆ వయస్సులో పాడు పనులకు అలవాటు పడింది. స్థానికంగా ఉండే ఓ ముగ్గురు కుర్రాళ్లతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ కుర్రాళ్లు నేర స్వభావం ఉన్నవాళ్లు కావడంతో.. మాయ ఆస్తిపై కన్నేశారు. దేవేంద్రను లేపేద్దాం.. మనం ఇంకా బాగా ఎంజాయ్ చేద్దాం అంటూ మర్డర్ ఐడియా ఇచ్చారు. అందుకు మాయ ఓకే అనేసింది. మే 8న అనుకున్నట్టుగానే ప్లాన్ ప్రకారం దేవేంద్రను చంపేసి, ముక్కలుగా నరికేసి, శరీర భాగాలను వేరు వేరు చోట్ల పడేశారు. ఆ తర్వాత ఏం తెలీనట్టు మాయ నాటకం మొదలు పెట్టింది.
మాయ ఫోన్‌లో అసలు మేటర్
తమ కూతురును తీసుకురావడానికి వెళ్లిన భర్త ఇంటికి తిరిగిరాలేదని మాయ పోలీసులకు కంప్లైంట్ చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు స్టార్ట్ చేశారు. ఎంక్వైరీలో భాగంగా మాయ మొబైల్‌ను చెక్ చేస్తే పోలీసులకు అనుమానం వచ్చింది. మాయను సీరియస్‌గా ప్రశ్నిస్తే.. ఆమె రంకు వ్వవహారం తెలిసింది. మిథిలేష్, అనిల్, సతీష్‌లతో తనకు అక్రమ సంబంధాలు ఉన్నాయని ఒప్పేసుకుంది. నలుగురం కలిసి దేవేంద్రను చంపేశామని అంగీకరించింది.
తల నరికి నదిలో వేశారు..
యూపీ, బల్లియాకు చెందిన దేవేంద్ర రామ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఓ పొలంలో అతని శరీర భాగాలు లభించాయి. దుర్వాసన వస్తోందని స్థానికుల ఫిర్యాదుతో మర్డర్ విషయం వెలుగుచూసింది. అతని మొండెం బావిలో బయటపడింది. అతని తల, మరికొన్ని బాడీ పార్ట్స్ నదిలో విసిరివేయబడ్డాయి. అవి ఇంకా దొరకనే లేదు. వాటికోసం పోలీసులు వెతుకుతున్నారు.
పోలీసులతో ఎన్‌కౌంటర్..
ఆ కేసులో అతని భార్య మాయను, ఆమె లవర్ మిథిలేష్ పటేల్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. మిగతా ఇద్దరు నిందుతుల కోసం పోలీసులు గాలిస్తుండగా.. స్థానిక పాలిటిక్నిక్ కాలేజ్ సమీపంలో నిందితులు తారసపడ్డారు. పోలీసులను చూసి కాల్పులు జరిపారు ఆ ఇద్దరు. ఖాకీల ఎదురుకాల్పుల్లో అనిల్ యాదవ్‌కు బుల్లెట్లు తగిలాయి. ఆ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి దేవేంద్రను చంపి డెడ్‌బాడీని ముక్కలుగా నరికిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.