E-Paper
Advertisement

Sreeleela : శ్రీలీలా మూవీలో మలయాళ స్టార్ బసెల్ జోసెఫ్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Sreeleela : శ్రీలీలా మూవీలో మలయాళ స్టార్ బసెల్ జోసెఫ్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
Advertisement

Sreeleela : ఇటీవల కాలంలో మలయాళ ఇండస్ట్రీలో మారుమ్రోగుతున్న యంగ్ హీరో బాసిల్ జోసెఫ్. పక్కింటి అబ్బాయిలా కన్పించే ఈ హీరో న్యాచురల్ యాక్టింగ్ కు ఎంతోమంది అభిమానులు ఫిదా అయ్యారు. అయితే ఇప్పుడు ఈ యంగ్ హీరో సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల కలిసి ఓ సినిమాలో నటించబోతున్నారు. ఆ సినిమా పేరు ఏంటి? డైరెక్టర్ ఎవరు? అనే వివరాల్లోకి వెళ్తే….

 శ్రీలీల, బాసిల్ జోసెఫ్ ఒకే సినిమాలో…

Advertisement

లేడీ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ మూవీ పరాశక్తి. ఈ మూవీ 1965 లో తమిళనాడులో హిందీ భాషకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల ఆధారంగా రూపొందుతోంది. ఇది ఒక పొలిటికల్ పీరియాడికల్ డ్రామా. ఈ మూవీలో శివకార్తికేయన్, రవి మోహన్, అధర్వ, బాసిల్ జోసెఫ్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో, బాసిల్ జోసెఫ్ ముఖ్యమైన పాత్రలో నటించడంతో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగాయి.

చేతులు మారిన ప్రాజెక్ట్…

Advertisement

‘సూరారై పొట్రు’ తర్వాత సుధా కొంగర, సూర్య కలిసి ఈ సినిమాకు పని చేయాలని అనుకున్నారు .అయితే అనుకోని కారణాల వల్ల ఈ సినిమా నుంచి పక్కకు తప్పుకున్నారు సూర్య. ఆ తర్వాత సూర్య స్థానంలో శివకార్తికేయన్ తో స్క్రిప్ట్ ను ఓకే చేయించారు సుధ. ఈ సినిమాను డిసెంబర్ 2024లో SK25 గా ప్రకటించారు. ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ‘పరాశక్తి’ పేరుతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు  రాబోతోంది.

‘సూరారై పోట్రు’ (2020) తర్వాత రెండవసారి కలిసి ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టారు. మొదట్లో నిజమైన సంఘటనల నుండి ఈ ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్నారని హడావిడి చేశారు. అయితే సూర్యకు ఉన్న కంగువా (2024), సూరరై పోట్రు హిందీ రీమేక్ సర్ఫిరా (2024) కమిట్‌మెంట్‌ల కారణంగా ఈ సినిమా ఆలస్యం అయింది . మార్చి 2024 లో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని వార్తలు వచ్చిన తర్వాత, సుధ ఆ వాదనలను ఖండించింది. సినిమా ప్రీ-ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం పడుతోందని, దీని ఫలితంగా షూటింగ్ ఆలస్యం అయిందని చెప్పింది. అయితే జూలైలో సూర్య ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ శివకార్తికేయన్ ను అతని స్థానంలో తీసుకున్నారు. ఈ సినిమా నిర్మాణ సంస్థ అయిన డాన్ పిక్చర్స్, డిసెంబర్ 14న ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో మోస్ట్ వాంటెడ్ స్టార్స్ అందరూ భాగం కావడం గమనార్హం.

Read Also : మూడు తరాల ఆడియన్స్ కనెక్ట్ అయ్యే క్రేజీ కొరియన్ సిరీస్… ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×