Karimnagar Crime: స్టార్ డైరెక్టర్ వర్మ చెప్పినట్టు క్రైమ్ అదే.. దాని రూపం మారింది. వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చుపెడుతున్నాయి. అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్తను చంపేసింది భార్య. భర్తను ఎలా చంపాలో యూట్యూబ్‌లో తెలుసుకుని ప్లాన్ చేసి చంపేసింది. సంచలనం రేపిన ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో బయటపడింది.
కరీంనగర్ కిసాన్ నగర్ ప్రాంతానికి సంపత్-రమాదేవి దంపతులు. వీరికి పెళ్లయి ఇరవై ఏళ్లు పైనే అయ్యింది. వీరికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. సంపత్ వయస్సు 45 ఏళ్లు. అతడు జిల్లా గ్రంథాలయంలో స్వీపర్‌గా పని చేస్తున్నాడు. అయితే ఉన్నట్లు మద్యానికి బానిస అయ్యాడు సంపత్. దీంతో భార్యభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవి.
మద్యం మత్తులో భార్యను వేధించడం,కొట్టడం చేసేవాడు కూడా. ఇదే సమయంలో భార్య రమకు ఆ ప్రాంతానికి చెందిన రాజయ్యతో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. రాజయ్య వయస్సు ఐదు పదులపైనే ఉంటుంది. గత నెల అంటే జూలై 29న భార్య రమతో గొడవపడ్డాడు సంపత్, ఆ తర్వాత ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. ఆ తర్వాత ఇంటికి రాలేదు.
అటు నుంచి పైలోకానికి వెళ్లిపోయాడు. ఆ సమయం కోసం వేచి చూసిన రాజయ్య, సంపత్‌ని పిలిచి మద్యం పార్టీ ఇచ్చాడు. బొమ్మకల్ రైల్వే ట్రాక్ వద్ద పార్టీకి వేదికైంది. రాజయ్య, తన ఫ్రెండ్ శ్రీనివాస్, సంపత్ మందుపార్టీ చేసుకున్నారు. మద్యం మత్తులోకి సంపత్ జారుకున్నాడు. ఈలోగా రాజయ్య.. రమకు ఫోన్ చేసి చంపేందుకు అనుమతి తీసుకున్నాడు.
ALSO READ: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట, కేరళలో దారుణం
ఆమె ఓకే చెప్పడంతో రాజయ్య-శ్రీనివాస్‌లు తమ వెంట తెచ్చిన గడ్డి మందును సంపత్ చెవిలో పోశారు. ఆ తర్వాత మెదడుకు వ్యాపించటంతో సంపత్ అక్కడికక్కడే మరణించాడు. ఇంతవరకు రాజయ్య-రమ అనుకున్నట్లుగానే సాగింది. అక్కడి నుంచి అసలు సీన్ క్రియేట్ చేసింది. హత్య తర్వాత ఏమీ తెలియనట్లుగా నటించింది రమ్య.
కొడుకు భరత్, రాజయ్యతో కలిసి తన తండ్రి ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు డ్రామా క్రియేట్ చేసింది. నాలుగు రోజుల కిందట సంపత్ మృతదేహం లభ్యమైంది. తన తండ్రి మృతిపై అనుమానం వ్యక్తం చేసిన కొడుకు భరత్, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగేశారు పోలీసులు. తొలుత ఇంట్లో సంపత్ గురించి డీటేల్స్ సేకరించారు. ఆ తర్వాత రమ ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు.
ఆమెని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయాలు బయటపెట్టింది. రాజయ్యతో సంబంధం కారణంగా భర్తను తొలగించుకోవాలని ప్లాన్ చేసినట్టు తెలిపింది. ఈ క్రమంలో యూట్యూబ్‌లో చూసి భర్త హత్యకు ప్లాన్ చేసినట్టు తెలిపింది.
చెవిలో పురుగుల మందు పోస్తే చనిపోతారని తెలుసుకున్నానని చెప్పింది. అదే విషయాన్ని రాజయ్యకు చెప్పి ఆ తరహా హత్య చేయాలని సూచించినట్టు నిజం అంగీకరించింది. చివరకు ముగ్గుర్ని అరెస్టు చేసిన పోలీసులు, న్యాయస్థానంలో హాజరుపరిచారు. వారికి కోర్టు రిమాండ్ విధించింది.