FOX Spotted: ఆగస్టు 5వ తేదీ నుండి క్రికెట్ అభిమానులను అలరించడానికి “ది హండ్రెడ్” 2025 ఎడిషన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ఇన్నింగ్స్ కి 100 బంతులు మాత్రమే వేస్తారు. మొదట పవర్ ప్లే లో 25 బంతులు ఉంటాయి. ఇక ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొన్నాయి. వాటిలో ఓవల్ ఇన్వెన్షిబుల్, బర్మింగ్ హమ్ ఫీనిక్స్, లండన్ స్పిరిట్, సదరన్ బ్రేవ్, వెల్ష్ ఫైర్, మాంచెస్టర్ ఒరిజినల్స్, ట్రెంట్ రాకెట్స్, నార్తన్ సూపర్ చార్జర్స్ ఈ టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి.
Also Read: IND vs ENG: టీమిండియాలో మొత్తం గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లే…గిల్ విజయ రహస్యం ఇదేనా
ఈ టోర్నీ ఆగస్టు 31న ముగుస్తుంది. ఈ టోర్నీ లీగ్ దశలో మొత్తం 32 మ్యాచులు జరుగుతాయి. ప్రతి జట్టు ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. టేబుల్ టాపర్ నేరుగా ఫైనల్ కి వెళుతుంది. ఇక రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాయి. ఈ టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ ఆగస్టు 5వ తేదీన లండన్ స్పిరిట్ – ఓవల్ ఇన్విన్సిబుల్ {London Spirit vs Oval Invincibles} జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో ఓవల్ ఎన్విన్సిబుల్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన లండన్ స్పిరిట్.. 94 బంతుల్లో 80 పరుగులకే కుప్ప కూలింది. అనంతరం 81 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేదించేందుకు బరిలోకి దిగిన ఓవల్ ఇన్వెన్సిబుల్స్.. కేవలం 69 బంతుల్లోనే నాలుగు వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతుండగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. క్రికెట్ కి పుట్టినిల్లు ఐన లండన్ లోని లార్డ్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఒక నక్క {FOX Spotted} అకస్మాత్తుగా మైదానంలోకి దూసుకొచ్చింది.
ఈ ఘటనతో స్టేడియంలోని ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి, ఆనందానికి గురయ్యారు. లండన్ స్పిరిట్ బౌలర్ డేనియల్ వోరాల్ బౌలింగ్ చేయడానికి రెడీ అవుతున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రౌండ్ లోని పచ్చటి గడ్డిమీద పరుగులు తీస్తున్న ఆ నక్కను చూసిన ఆటగాళ్లు, అంపైర్లు, అభిమానులు ఆశ్చర్యపోయారు. నక్క {FOX} ఎంట్రీ తో కొన్ని క్షణాల పాటు మ్యాచ్ నిలిచిపోయింది.
ఇక ఆ నక్క కాసేపు మైదానంలో పరుగులు పెట్టి.. ఆ తర్వాత ఒక గేట్ ద్వారా బయటికి వెళ్లిపోయింది. అనంతరం మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. దీంతో మైదానంలో నక్క పరుగులు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ టోర్నమెంట్ ని ఘన విజయంతో ప్రారంభించింది ఓవల్ ఇన్వెన్సిబుల్స్. కాగా నేడు మాంచెస్టర్ వేదికగా.. సౌథ్ఎర్న్ బ్రేవ్ – మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్ల మధ్య రెండవ మ్యాచ్ జరగనుంది.
ది హండ్రెడ్ 2025 ఓపెనర్ మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్లోకి వచ్చిన నక్క.
లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో లండన్ స్పిరిట్ vs ఓవల్ ఇన్విన్సిబుల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ మధ్యలో నక్క ప్రత్యేక్షమైంది. కాసేపటి తర్వాత అది వెళ్లిపోయింది. కాగా ఈ మ్యాచ్లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ 6 వికెట్ల… pic.twitter.com/2gJseloeiX
— BIG TV Cinema (@BigtvCinema) August 6, 2025