Star Maa Parivaaram Promo: బుల్లితెర పై ప్రసారం అవుతున్న కొన్ని షోలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి ఫుల్ ఎంటర్టైన్మెంట్ షోలలో ఒకటి స్టార్ మా పరివారం. ఇది ప్రముఖ తెలుగు ఛానెల్ స్టార్ మాలో ప్రసారం అవుతుంది. సీరియల్ యాక్టర్స్, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎక్కువగా సందడి చేస్తుంటారు. తాజాగా వరలక్ష్మి వ్రతం స్పెషల్ ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో శ్రీముఖి, కావ్య మధ్య మాటలు హైలెట్ అయ్యాయి. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
స్టార్ మా పరివారం ప్రోమో..
వరలక్ష్మి వ్రతం స్పెషల్ ఎపిసోడ్ కు శివజ్యోతి, తేజస్విని గౌడ, యాంకర్ లాస్య, ప్రియాంక జైన్, కావ్యశ్రీ, రోహిణి, శ్రీసత్య, యశశ్విని సందడి చేశారు.. ఈ ప్రోమోలో.. మహాలక్ష్ములు అందరూ మా పరివారానికి వచ్చారు అంటూ శ్రీముఖి స్వాగతం పలికింది. వెంటనే అయ్యయ్యో అమ్మగారు కొబ్బరికాయలు, అగరబత్తులు తేవడం మర్చిపోయా అంటూ ఎక్స్‌ప్రెస్ హరి డైలాగ్ కొట్టాడు. నువ్వు గుడికి లాలేదు కదరా అని శ్రీముఖి అడిగితే దేవతల ముందే ఉన్నా అని హరి భారీ డైలాగుతో అందరి హృదయాన్ని దోచుకుంటాడు. పెళ్లి కానీ బ్యూటీలు అంతా వచ్చారు. వీళ్లపై శ్రీముఖి డైలాగులు కొట్టింది. పెళ్లి కళ అనగానే అందరి ముఖాల్లో నవ్వు కనిపించింది. సత్యకు పెళ్లి వద్దు అనుకుంటాను అని సెటైర్ వేస్తుంది. ప్రోమోలో సరదాగా అందరు కనిపిస్తున్నారు.
పెళ్లి ఓపెన్ అయిన కావ్య..
శ్రీముఖి కావ్యతో సరదాగా మాట్లాడింది. చివరిలో కావ్య పెళ్లి టాపిక్ తీసుకువచ్చింది శ్రీముఖి. నువ్వు పెళ్లి చేసుకుంటే చూడాలని మేమందరం ఎదురుచూస్తున్నాం.. అంటూ శ్రీముఖి అంటుంది. దానికి పక్కనే ఉన్న రోహిణి నా లాంటి అందమైన అమ్మాయిలకే కావడం లేదు మీకు ఎలా అవుతుంది అంటూ మళ్లీ సెటైర్ వేసింది. దాంతో ప్రోమో ఎండ్ అవుతుంది. ఇక కావ్య, నిఖిల్ ఇద్దరు ప్రేమించుకున్నారు. కొన్నేళ్ల పాటు ఇద్దరూ సహజీవనం కూడా చేశారు. ఈమధ్య మనస్పర్ధలు రావడంతో ఇద్దరు విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ కలుస్తారని నమ్మకం ఎవరికీ లేదు. ఎవరికి వారే అన్నట్లు ఎవరి లైఫ్ వాళ్ళు బిజీగా గడుపుతున్నారు.. కావ్య ప్రస్తుతం వరుసగా సీరియల్స్ చేసుకుంటూ బిజీగా ఉంది.
Also Read:ఈ రెండు పార్ట్స్ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?
బిగ్ బాస్ లోకి ఎంట్రీ..
కావ్య గోరింటాకు వంటి సూపర్ హిట్ సీరియల్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు ఐదేళ్లపాటు నిఖిల్ తో ప్రేమాయణం నడిపింది. ఈమధ్య వీళ్ళిద్దరూ బ్రేకప్ చెప్పుకున్న విషయం తెలిసిందే.. నిఖిల్ కావ్య కోసం వెయిట్ చేస్తున్నాడు కానీ కావ్య మాత్రం నిఖిల్ ని మళ్ళీ తన లైఫ్ లోకి రానిచ్చే పరిస్థితి కనిపించడం లేదు.. ప్రస్తుతం ఈమె చిన్ని సీరియల్ లో నటిస్తుంది. ఇక రీసెంట్ గా బుల్లితెర టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ లోకి రాబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ షోలో ఈమె ఉందో లేదో త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.