E-Paper
Advertisement

Nalgonda Crime: ప్రియుడి కోసం.. భార్య ఏం చేసిందో తెలుసా? నిద్ర పోతున్న భర్త నోట్లో గుడ్డలు పెట్టి

Nalgonda Crime: ప్రియుడి కోసం.. భార్య ఏం చేసిందో తెలుసా? నిద్ర పోతున్న భర్త నోట్లో గుడ్డలు పెట్టి
Advertisement

Nalgonda Crime: పచ్చని సంసారంలో వివాహేతర సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి. ఫలితంగా హత్యలకు తెగబడుతున్న ఉదంతాలు క్రమంగా పెరుగుతున్నాయి. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో భర్తని చంపేసింది అగ్నిసాక్షిగా తాళి కట్టించుకున్న భార్య. సంచలనం రేపిన ఈ ఘటన నల్గొండ జిల్లాలో వెలుగుచూసింది. అసలేం జరిగింది?

నల్లొండ జిల్లాలో దారుణం.. భర్తని లేపేసిన భార్య

Advertisement

నల్లొండ జిల్లా మాడ్గులపల్లి మండలం సీత్యాతండా గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆ గ్రామానికి చెందిన రవికి మిర్యాలగూడ మండలం ఏడుకోట్ల తండాకు చెందిన లక్ష్మి వివాహం జరిగింది. వీరి వివాహం జరిగి దాదాపు పుష్కరకాలం అవుతోంది. ఈ జంటకు ఇద్దరు కొడుకులున్నారు. పెద్ద కొడుకు సూర్యాపేటలో చదువుతున్నాడు. చిన్న కుమారుడు మానసిక దివ్యాంగుడు కావడంతో పేరెంట్స్ వద్ద ఉంటున్నాడు.

రవి.. వేములపల్లి మండలంలోని ఓ ఆఫీసులో అటెండర్‌గా పని చేస్తున్నాడు. రవి అక్క కొడుకు గణేశ్‌ ఇంటికి తరచూ వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో అతడితో లక్ష్మి మరింత దగ్గరైంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలిసి రవి ఆశ్చర్యపోయాడు. తన మేనల్లుడు ఇలా చేయడంతో షాకయ్యాడు.

Advertisement

ప్రియుడితో కలిసి ప్లాన్, ఆ తర్వాత చంపేసి 

ఈ విషయంలో దంపతుల మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ఏడాది కిందట పుట్టింటికి వెళ్లిపోయింది లక్ష్మి. రవి-తల్లిదండ్రులు కలిసి గ్రామానికి చెందిన పెద్ద మనుషులతో మాట్లాడి లక్ష్మిని తిరిగి కాపురానికి తీసుకొచ్చాడు. అయినా వీరి మధ్య సఖ్యత ఏ మాత్రం కుదరలేదు. చివరకు జనవరి 26న అంటే సోమవారం భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ జరిగింది.

రవి పెద్ద కొడుకుని హాస్టల్‌లో చేర్చేందుకు అతడి తండ్రి సూర్యాపేట వెళ్లాడు. తల్లి పొలం పనులకు వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కొడుకు రూమ్‌లో లైటు వేసి ఉండడంతో తల్లిదండ్రులు పట్టించుకోలేదు. బుధవారం ఉదయం కొడుకు, కోడలు గది నుంచి రాలేదు. దీంతో తల్లిదండ్రులు తలుపు తీసి చూడగా రవి విగత జీవిగా కనిపించాడు.

ALSO READ: స్కూల్ బస్సులో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

కొడుకుని ఆ విధంగా చూసి షాకయ్యారు తల్లిదండ్రులు. కోడలు కనిపించపోవడంతో షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు, గదిని క్షుణ్నంగా పరిశీలించారు. భర్త మేనల్లుడు గణేశ్‌ హైదరాబాద్‌లోని ఓ బంగారం షాపులో పని చేస్తున్నాడు. మంగళవారం అతడికి ఫోన్‌ చేసి ఇంటికి రప్పించిందట లక్ష్మి. మద్యం మత్తులో ఉన్న రవిపై లక్ష్మి-గణేశ్‌ దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలదుపెట్టారు. పరారీలో ఉన్న గణేశ్‌తోపాటు లక్ష్మి, ఆమె చిన్నకొడుకు కోసం గాలిస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×