E-Paper
Advertisement

Kurnool Crime: కోరుకున్న ప్రియుడి కోసం.. ఆపై హెచ్ఐవీ ఇంజక్షన్, అడ్డంగా బుక్కైన నర్సు

Kurnool Crime: కోరుకున్న ప్రియుడి కోసం..  ఆపై హెచ్ఐవీ ఇంజక్షన్, అడ్డంగా బుక్కైన నర్సు
Advertisement

Kurnool Crime: కోరుకున్న ప్రియుడ్ని దక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది ఆ నర్సు. ప్రియుడ్ని-అతడి భార్యని విడగొట్టేందుకు భారీ స్కెచ్ వేసింది. ప్రాణాంతక ఇంజెక్షన్‌తో దాడి చేయించింది ఆ నర్సు. సంచలనం రేపిన ఈ ఘటన కర్నూలు టౌన్‌లో వెలుగుచూసింది. ప్లాన్ రివర్స్ అయి అడ్డంగా దొరికిపోయింది ఆ నర్సు.

కర్నూలు పట్టణంలో దారుణం.. అడ్డంగా బుక్కైన నర్సు

Advertisement

కర్నూలు పట్టణంలోని గణేష్‌ నగర్‌లో ఓ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నివాసం ఉంటున్నారు. నందికొట్కూరు రోడ్డులో నివాసం ఉంటోంది వసుంధర అలియాస్ వేదవతి. ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తోంది. గతంలో ఓ డాక్టర్‌ని ప్రేమించింది వసుంధర. ఆ డాక్టర్‌ వసుంధరను కాదని వైద్యురాలిని వివాహం చేసుకున్నాడు.

ఆనాటి నుంచి తన ప్రియుడ్ని దక్కించుకోవాలని స్కెచ్ వేసింది. ఈ క్రమంలో ప్రియుడి భార్యపై ద్వేషం పెంచుకుంది. ఈ క్రమంలో ప్రియుడి భార్య డాక్టరమ్మకి హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌ చేయాలని ప్లాన్‌ చేసింది. వైద్యురాలికి హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌ ఇస్తే, హెచ్‌ఐవీ సోకిందని భావించి ఆ జంట విడిపోతుందని ప్లాన్ చేసింది. అందుకోసం ముగ్గురు వ్యక్తుల సహకారం తీసుకుంది.

Advertisement

ప్రియుడి కోసం.. వైరస్ ఇంజెక్షన్,  పోలీసుల అదుపులో నిందితులు

వారిలో ఒకరు జ్యోతి, ఆమె ఆదోనికి చెందినది. మరో ఇద్దరు భూమా జశ్వంత్‌, శృతిలు మంత్రాలయం ప్రాంతానికి చెందినవారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హెచ్‌ఐవీ పేషెంట్ల నుంచి రక్తాన్ని సేకరించింది. ఈ నెల 9న టూవీలర్స్‌పై ఇంటికి వెళ్తుండగా కేసీ కెనాల్‌ గట్టు వద్ద వైద్యురాలి వాహనాన్ని ఢీ కొట్టారు.

వైద్యురాలిని ఆటోలో ఎక్కించేందుకు సహాయం చేస్తున్నట్లు నటించి హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌ వేశారు. బాధితురాలి అనుమానం వచ్చి గట్టిగా కేకలు వేసింది. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. ఘటన, ఆ తర్వాత జరిగిన విషయాన్ని వైద్యురాలు తన భర్తకు చెప్పింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దంపతులు కర్నూలు మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ALSO READ: దారుణ విషాదం.. 50 వరకు అంకెలు చెప్పలేదని నాలుగేళ్ల కూతురిని కొట్టి చంపిన తండ్రి

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు, నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో అసలు విషయాలు బయటకు వచ్చాయి. ప్రధాన నిందితురాలు వసుంధర నర్సుగా పని చేస్తున్నట్లు తేలింది. నర్సుతోపాటు మిగతా ముగ్గురు కటకటాల పాలయ్యారు. ఆ మధ్య తెలుగులో ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ సినిమా వచ్చింది. అచ్చం ఆ సినిమాని తలపించేలా ఘటనగా చెబుతున్నారు.

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×