E-Paper
Advertisement

Faridabad Murder: దారుణ విషాదం.. 50 వరకు అంకెలు చెప్పలేదని నాలుగేళ్ల కూతురిని కొట్టి చంపిన తండ్రి

Faridabad Murder: దారుణ విషాదం.. 50 వరకు అంకెలు చెప్పలేదని నాలుగేళ్ల కూతురిని కొట్టి చంపిన తండ్రి
Advertisement

హరియాణా రాష్ట్రంలో మనసు కలిచివేసే అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఏమీ తెలియని నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలను, కన్నతండ్రే లెక్కల పేరుతో బలి తీసుకున్నాడు. 50 వరకు అంకెలు చెప్పలేదన్న స్వల్ప కారణంతో ఆగ్రహానికి గురైన ఆ తండ్రి, చిన్నారిని చిత్రహింసలకు గురిచేసి ప్రాణాలు తీశాడు. ఈ దారుణ ఘటన ఫరీదాబాద్‌లోని సెక్టార్-58లో జనవరి 21న చోటుచేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 31 ఏళ్ల కృష్ణ జైస్వాల్, ఫరీదాబాద్‌లో అద్దె ఇంట్లో ఉంటూ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు కావడంతో, భార్య పగలు డ్యూటీకి వెళ్లేది, భర్త నైట్ షిఫ్ట్ చేసేవాడు. పగటిపూట ఇంట్లోనే ఉండి పిల్లలను చూసుకునే కృష్ణ, వారికి చదువు చెప్పేవాడు. ఈ క్రమంలో బుధవారం తన నాలుగేళ్ల కుమార్తెను 50 వరకు అంకెలు లెక్కించమని అడిగాడు. ఆ చిన్నారి సరిగ్గా చెప్పలేకపోవడంతో విచక్షణ కోల్పోయిన అతను, చపాతీ కర్రతో తీవ్రంగా కొట్టాడు. ఆ దెబ్బలకు తాళలేక చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది.

Advertisement

తన నేరాన్ని దాచేందుకు కృష్ణ, పాప మెట్లపై నుంచి పడిపోయిందని భార్యను నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే, ఏడేళ్ల కుమారుడు తన తల్లికి అసలు నిజం చెప్పాడు. ‘నాన్న 50 వరకు లెక్కలు రాయమన్నారని, రాయలేదని చెల్లిని కొట్టారని’ బాలుడు వివరించాడు. దీంతో షాక్‌కు గురైన తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం నిందితుడు పోలీసు కస్టడీలో ఉన్నాడని, పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసు ప్రతినిధి యశ్‌పాల్ సింగ్ తెలిపారు.

మరో ఘటనలో.. హరియాణాలోని పిథోరాగఢ్ జిల్లాలో కుటుంబ కలహాల కారణంగా రాజేష్ రామ్ అనే వ్యక్తి తన భార్య నీలమ్ (30)ను కత్తితో పొడిచి హత్య చేశాడు. గొడవ ముదిరిన క్రమంలో రాజేష్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. హత్య అనంతరం నిందితుడు స్వయంగా పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోవడం గమనార్హం. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

ALSO READ: BJP MLA: బీజేపీ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే దారుణం.. బట్టలు విప్పి మూత్రం పోసి.. వీడియో కాల్‌లో చూస్తూనే..?

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×