Mysuru News: కారణాలు ఏమైనా కావచ్చు.. ఈ మధ్యకాలంలో బాత్‌రూమ్‌లో గీజర్ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. చాలామంది చనిపోతున్నారు. కొద్దిరోజుల్లో పెళ్లి కావాల్సిన యువతి, అనుహ్యూంగా బాత్‌రూమ్‌లో గీజర్ బారినపడి మృత్యువాత పడింది. అసలు మేటరేంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
గీజర్ ఇద్దర్ని చంపేసింది
కర్ణాటకలోని మైసూర్‌లో ఊహించని విషాదం జరిగింది. పెరియపట్నం ప్రాంతంలోని జోనిగేరి కాలనీలో అద్దె ఇంట్లో ఉంటోంది అల్తాఫ్ పాషా ఫ్యామిలీ. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గుల్పామ్ తాజ్ వయసస్సు 23 ఏళ్లు కాగా, ఆమె సోదరి సిమ్రాజ్ తాజ్‌కు 20 ఏళ్లు. ఈ మధ్యనే గుల్పామ్ తాజ్‌కు మ్యారేజ్ సెటిలైంది. ఎంగేజ్‌మెంట్ పూర్తికావడంతో రేపో మాపో వివాహం జరగనుంది. దీనికి సంబంధించిన ప్రయత్నాలు పేరెంట్స్ చేస్తున్నారు.
పెళ్లికి సంబంధించిన పనుల్లో అల్తాఫ్ ఫ్యామిలీ బిజీగా ఉంది. గురువారం రాత్రి సమయంలో ఇద్దరు సిస్టర్స్ గుల్పామ్-సిమ్రాజ్ తాజ్ స్నానానికి బాత్రూమ్‌కి వెళ్లారు. అయితే ఆ ఇంట్లో గ్యాస్ గీజర్ ఉంది. అది ఆన్ చేయగానే ఒక్కసారిగా గ్యాస్ వెలువడింది, బాత్రూమ్ అంతా వ్యాపించింది. అది పీల్చడంతో శ్వాస ఆడక అక్కాచెల్లెళ్లు స్పృహ కోల్పోయి బాత్రూమ్‌లో పడిపోయారు. ఈ సమయంలో పేరెంట్స్ పెళ్లి పనుల నిమిత్తం బయటకు వెళ్లారు.
అసలు బాత్రూమ్‌లో ఏం జరిగింది?
ఆ తర్వాత ఇంటికి వచ్చారు. బాత్రూమ్ నుంచి ఆడ పిల్లలు ఎంతకీ బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. బలవంతంగా తలుపు తెరిచి చూడగా గుల్పామ్-సిమ్రాజ్ తాజ్‌లు అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే వారిని కుటుంబసభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. ఆ వార్త విని యువతి తల్లిదండ్రులు షాకయ్యారు.
ALSO READ: హైదరాబాద్ లో కాల్పుల కలకలం.. సౌత్ఈస్ట్ డీసీపీపై దొంగలు దాడి
రేపో మాపో అత్తారింటికి వెళ్లాల్సిన కూతురు ఈ లోకాన్ని విడిచిపెట్టడాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇద్దరు కూతుళ్లు చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆసుపత్రిలో మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించారు డాక్టర్లు. గీజర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ వాయువు పీల్చడంతో మరణించినట్లు ప్రాథమికంగా తెలిపారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
గ్యాస్ గీజర్లు ఉపయోగించేటప్పుడు వెంటిలేషన్ ఉండాలని చెబుతున్నారు. గీజర్‌ను కిటికీ లేదా సరైన గాలి మార్గం ఉన్న చోట ఉంచాలన్నారు. కార్బన్ మోనాక్సైడ్ వాయువు వాసన ఉండదని, లీకైన విషయం తెలియక ప్రమాదం జరుగుతున్నాయి. ఈ విషయంలో అలర్ట్ గా ఉండాలని చెబుతున్నారు.