Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పలు కోణాల్లో విచారణ చేపట్టారు. అయితే పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. బైక్‌పై శంకర్‌తో పాటు ఉన్న మరో యువకుడు ఎర్రిస్వామిని పోలీసులు గుర్తించారు. ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
బైక్‌ను వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు నేరుగా ఢీకొట్టలేదని స్పష్టం చేశారు. వర్షంలో బైక్‌పై వెళుతున్న శంకర్, ఎర్రిస్వామి మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. చిన్నటేకూరు దగ్గర బైక్ స్కిడ్ అయ్యి శంకర్, ఎర్రిస్వామి కిందపడ్డారు. రోడ్డు మధ్యలో బైక్ ఉండిపోగా ఇద్దరూ చెరో వైపు పడిపోయారు. బైక్ పై నుంచి పడిపోయినప్పుడు డివైడర్‌ను ఢీకొట్టడంతో శంకర్ తలకు బలమైన గాయాలు అయ్యాయి. దీంతో స్పాట్‌లో శంకర్ మృతి చెందాడు. ఎర్రిస్వామి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
బైక్ ప్రమాదానికి గురైన కాసేపటికి వేగంగా బైక్‌పై నుంచి వి.కావేరి ట్రావెల్స్ బస్సు వెళ్లింది. అయితే సుమారు 300 మీటర్ల వరకూ బైక్‌ను బస్సు ఈడ్చుకెళ్లింది. బస్సులో మంటలు చెలరేగడంతో భయపడిన ఎర్రిస్వామి అక్కడి నుంచి పరారయ్యాడు. సీపీ ఫుటేజ్, సెల్‌ఫోన్ నంబర్ల ఆధారంగా ఎర్రిస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రిస్వామి స్వస్థలం తుగ్గలి మండలం రాంపల్లి అని తెలుస్తోంది.
బస్సు ప్రమాదానికి ముందు ఓ పెట్రోల్ బంక్‌లో శివశంకర్, ఎర్రిస్వామి దృశ్యాలు రికార్డు అయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున 2.24 గంటల వరకు పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కోసం శంకర్ బైక్ పై వచ్చాడు. అతడితో పాటు ఎర్రిస్వామి ఉన్నాడు. బంక్ లో పెట్రోల్ కొట్టించుకుని వెళ్లిపోయారు. 2.39కి పెట్రోల్ బంక్‌ను బస్సు క్రాస్ చేసినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయింది.
కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రోడ్డుపై పడి ఉన్న బైక్ ను ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగాయని పోలీసులు చెబుతున్నారు. బస్సు ప్రమాదానికి ముందు పెట్రోల్ బంకులోకి బైకర్ శివశంకర్ వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఆ సమయంలో శివశంకర్ పాటు బైక్‌పై ఎర్రిస్వామి అనే యువకుడు ఉన్నాడు. శివశంకర్ మద్యం మత్తులో ఉన్నట్లు సీసీ కెమెరాల్లో తెలుస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో శివశంకర్ మృతి చెందిన విషయం తెలిసిందే.