Hyderabad News: హైదరాబాద్‌లో ఓ యువ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి హెయిర్ ఊడిపోవడమే ఇందుకు కారణమైంది. బట్ట తల కారణంగా వధువు ఫ్యామిలీ సెటిలైన మ్యారేజ్‌ను రిజెక్ట్ చేసింది. ఈ అవమానాన్ని తట్టుకోలేపోయాడు ఆ డాక్టర్. చివరకు రైల్వే పట్టాలపై పడుకుని ప్రాణం తీసుకున్నాడు. సంచలనం రేపిన ఈ ఘటనలో హైదరాబాద్ లో వెలుగు చూసింది.
తెలుగు రాష్ట్రాల్లో మ్యారేజ్‌లు కాక పెళ్లి కాని ప్రసాద్ లు పెరిగిపోతున్నారు. అమ్మాయి రేషియా తక్కువగా ఉండడమే దీనికి కారణమని పలు సంస్థల నివేదికలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని కాసేపు పక్కనబెట్టి అసలు విషయంలోకి వద్దాం.
ఏం జరిగింది?
సికింద్రాబాద్ రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు గుజరాత్‌కి చెందిన ప్రకాష్‌మాల్ ఫ్యామిలీ ఏళ్ల తరబడి హైదరాబాద్‌లో సెటిలైంది. ఆయన ఫ్యామిలీకి ఇద్దరు అబ్బాయిలు. చిన్న కుమారుడు 34 పురోహిత్ కిషోర్ ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. అల్వాల్‌లోని బస్తీ దవాఖానాలో బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. వైద్య వృత్తి అనే సరికి ఆ ఫ్యామిలీ వైపు చూసుకోవాల్సిన అవసరం లేదని చాలామంది భావిస్తారు.
కొద్ది రోజుల కిషోర్‌కు ఎంగేజ్‌మెంట్ జరిగింది. కిషోర్ ఫ్యామిలీ నిశ్చితార్థ వేడుకను ఘనంగా చేసింది. రేపో మాపో పెళ్లికి ముహూర్తాలు పెట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. అయితే కిషోర్ లైటుగా బట్ట తల వచ్చింది. దానివల్ల ఆ ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అయిపోయింది. ఆ తర్వాత చాలా సంబంధాలు వచ్చినా ఏమీ సెట్ కాలేదు. చివరకు మానసికంగా కుంగిపోయాడు కిషోర్. జీవితంలో పెళ్లి కాదని నిర్ణయించుకున్నాడు.
ALSO READ: నలుగురు పిల్లల్ని చంపిన తండ్రి, ఆపై ఆత్మహత్య
బ్రహ్మచారిగా ఉండిపోయినా బాగుండేది. ఇలాంటి జీవితం తనకు వద్దని నిర్ణయం తీసుకున్నాడు. చనిపోవాలని డిసైడ్ అయ్యాడు. బుధవారం ఉదయం డాక్టర్ కిషోర్ తన బైక్‌పై బొల్లారం రైల్వేస్టేషన్ వచ్చాడు అక్కడే పార్క్ చేశాడు. రైల్వేస్టేషన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్ వస్తున్న నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
రైలు డ్రైవర్ ఈ విషయాన్ని గమనించి, రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించారు. మృతుడి గుర్తింపు కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ తర్వాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఆ తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కిషోర్ ఫ్యామిలీలో ఊహించని విషాదం జరిగింది.
కిషోర్ ఫ్యామిలీలో విషాదం
ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కొడుకు ఇలాంటి దారుణానికి పాల్పడతాడని తాము ఊహించలేదని, బ్రహ్మచారిగా ఉండిపోయినా బాగుండేదని అంటున్నారు. ఇప్పుడున్న రోజుల్లో చాలా మంది యువకులు హెయిల్ లాస్ సమస్యతో బాధపడుతున్నారు. తీసుకున్న ఆహారం, పొల్యూషన్ వంటి కారణంగా చిన్న వయసులో బట్ట తల రావడంతో కుమిలిపోతున్నారు.
తమపై ఆత్మవిశ్వాసం కోల్పోయి ఒత్తిడికి లోనవుతున్నారు. ఫలితంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. తలపై హెయిర్ లేకుంటే పిల్లని ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు. అమ్మాయిలు సైతం అలాంటివారిని పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడటం లేదు. ఒకప్పుడు అబ్బాయి గుణాలు చూసేశారు. ఇప్పుడు ఆ విషయాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు అనేది మాత్రమే చూస్తున్నారు.