OTT Movie : కొన్ని సినిమాలు దర్శకుడితో పాటు నటీనటులకు కూడా మంచి పేరు తెచ్చి పెడతాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా అటువంటిదే. ఈ మూవీ ఆరు ఆస్కార్ అవార్డులను కూడా గెలుచుకుంది. ఒక డాక్టర్ ఆత్మలను చూసే ఒక చిన్న పిలాడికి ట్రీట్ మెంట్ చేస్తాడు. ఆ ఒక్క పాయింట్ తో మూవీని ఎక్కడికో తీసుకుపోయాడు దర్శకుడు. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..
హాట్ స్టార్ (Hotstar) లో
ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది సిక్స్త్ సెన్స్’ (The Sixth Sense). 1999లో విడుదలైన ఈ మూవీకి M. నైట్ శ్యామలన్ దర్శకత్వం వహించారు. ఇందులో బ్రూస్ విల్లీస్ చైల్డ్ సైకాలజిస్ట్‌గా నటించాడు. బ్యూనా విస్టా పిక్చర్స్ తన హాలీవుడ్ పిక్చర్స్ లేబుల్ ద్వారా ఆగష్టు 6, 1999 లో ఈ మూవీని విడుదల చేసింది.’ది సిక్స్త్ సెన్స్’ దర్శకత్వం, క్లైమాక్స్ ట్విస్ట్ లకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. శ్యామలన్‌కి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, ఓస్‌మెంట్‌కి ఉత్తమ సహాయ నటుడు, కొల్లెట్‌కి ఉత్తమ సహాయ నటితో సహా ఆరు అకాడమీ అవార్డులకు ఇది నామినేట్ చేయబడింది. ఈ మూవీ వాణిజ్యపరంగా ప్రపంచవ్యాప్తంగా 672 మిలియన్లకు పైగా వసూలు చేసింది. 1999లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. హాట్ స్టార్ (Hotstar) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
మాల్కం ఫిలడెల్ఫియాలో ఒక ప్రముఖ చైల్డ్ సైకాలజిస్ట్ గ్ విధులు నిర్వహిస్తుంటాడు. ఒక రోజు రాత్రి అతను తన భార్య అన్నాతో కలిసి ఉన్నప్పుడు, అతని మాజీ రోగి విన్సెంట్ గ్రే అనే వ్యక్తి అతని ఇంట్లోకి చొరబడతాడు. విన్సెంట్ మానసిక సమస్యలతో బాధపడుతూ, మాల్కం తనకు సరిగ్గా ట్రీట్ మెంట్ చేయలేదని ఆరోపిస్తాడు. ఆ ఆవేశంలో, విన్సెంట్ మాల్కంను కాల్చి, ఆ తర్వాత తనను తాను కాల్చుకుంటాడు. ఈ ఘటనలో విన్సెంట్ అక్కడికక్కడే చనిపోతాడు. మాల్కం కొలుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. ఆ తర్వాత కోల్ సియర్ అనే 9 ఏళ్ల బాలుడికి ట్రీట్ మెంట్ చేయడం మొదలు పెడతాడు. కోల్‌కి కూడా విన్సెంట్ లాంటి మానసిక సమస్యలు ఉన్నాయని మాల్కం భావిస్తాడు. అతను చనిపోయిన వ్యక్తుల ఆత్మలను చూడగళనని మాల్కం కు చెప్తాడు. ఈ ఆత్మలు నన్ను భయపెడుతున్నాయని, సహాయం కూడా కోరుతున్నాయని వివరిస్తాడు.
మొదట్లో మాల్కం దీన్ని నమ్మకపోయినా, కోల్ కి సహాయం చేయాలనే పట్టుదలతో అతన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కోల్ చెప్పిన సంఘటనలు నిజమని తెలుసుకున్న తర్వాత, మాల్కం అతనికి ఒక సలహా ఇస్తాడు. ఈ ఆత్మలు కోల్‌ని సంప్రదించడానికి ఒక కారణం ఉండవచ్చు, కాబట్టి వాటికి భయపడకుండా వాటి మాట వినమని చెబుతాడు. ఆ తరువాత కోల్ ఒక చిన్న అమ్మాయి ఆత్మ ద్వారా, ఆమె ఎలా చనిపోయిందో తెలుసుకుంటాడు. ఆమెను సవతి తల్లి విషం ఇచ్చి చంపిందని తెలుస్తుకొని, కోల్ ఈ విషయాన్ని బయటపెట్టడంలో ఆత్మకు సహాయం చేస్తాడు. దీనితో కైరా ఆత్మకు శాంతి లభిస్తుంది. సినిమా క్లైమాక్స్ లో మాల్కం తన భార్య అన్నాతో మాట్లాడే ప్రయత్నంలో ఒక షాకింగ్ విషయం తెలుసుకుంటాడు. అది ఏమిటంటే .. విన్సెంట్ కాల్పుల్లో తాను కూడా చనిపోయి ఉంటాడు. కానీ అతను దాన్ని గురించకుండా కోల్ పనిని పూర్తి చేసేందుకు ఉన్నాడు. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకున్న మాల్కం, తన భార్యకు వీడ్కోలు చెప్పి అవతలి లోకానికి వెళ్తాడు. స్టోరీ ఇలా ముగుస్తుంది.