OTT Movie : టైం ట్రావెల్ సినిమాలను హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు తెరకెక్కించారు. ఈ సినిమాలు చూడటానికి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి. అయితే కొన్ని సినిమాలు అర్థం అవడానికి కాస్త సమయం పడుతుంది. చివరి వరకు సినిమా చూస్తే గాని మనసుకు ప్రశాంతంగా ఉండదు. ఈ సినిమాలో అలాంటి ట్విస్టులు ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పబోయే మూవీలో కూడా ఫ్యూచర్ నుంచి గతానికి వెళ్లి కొన్ని తప్పులు సరిదిద్దాలనుకుంటాడు ఒక వ్యక్తి. ఈ మూవీ కూడా మిమ్మల్ని చివరి వరకు కన్ఫ్యూజ్ చేస్తుంది. ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ మూవీ పేరు ‘ప్రేడెస్టినేషన్’ (Predestination). ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ రాబర్ట్ ఎ. హైన్‌లైన్ రాసిన ‘All You Zombies’ అనే చిన్న కథ ఆధారంగా రూపొందించారు. ఈ సినిమా టైమ్ ట్రావెల్ లో జరిగే సన్నివేశాల చుట్టూ తరుగుతుంది. దీనిని మైకెల్, పీటర్ కలసి దర్శకత్వం వహించారు. ఇందులో ఇథాన్ హాక్, సారా స్నూక్, నోహ్ టేలర్ నటించారు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీలోకి వెళితే
జైన్ అనే అమ్మాయి అనాధాశ్రమంలో పెరుగుతుంది. అందరికంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఆమె తెలివిని చూసి అక్కడ ఉన్న వాళ్ళు స్పేస్ కి సంబంధించిన ఒక స్కూల్లో జాయిన్ చేస్తారు. అయితే అన్నిట్లో పాస్ అయిన ఆమెను, వ్యక్తిగత కారణాలవల్ల పక్కన పెడతారు. అలా తను మళ్లీ ఒక చిన్న జాబ్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆమెకు ఒక వ్యక్తి పరిచయం అవుతాడు. ఇద్దరు కలిసి ఒకసారి ఇంటిమేట్ కూడా అవుతారు. ఈ క్రమంలో కొన్ని రోజులకి జైన్ ప్రెగ్నెంట్ అవుతుంది. ఆమె ఒక అబ్బాయిని కూడా కంటుంది. అయితే జేన్ కి స్త్రీ పురుషుల జననా అవయవాలు కలిపి ఉంటాయి. డెలివరీ సమయంలో ఆమె స్త్రీ తత్వం కోల్పోతుంది. పురుషుడిగా మార్చడానికి మాత్రమే అక్కడ వీలుంటుంది. డాక్టర్లు కూడా ఆమెకు విషయం చెప్పి జైన్ ను మగవాడిగా మార్చేస్తారు. జైన్ కాస్త జాన్ అవుతాడు. ఆ తర్వాత ఒక బార్ లో సర్వర్ గా పని చేస్తుంటాడు. అక్కడ ఒక వ్యక్తి జాన్ కి పరిచయం అవుతాడు. ఈ విషయం అంతా ఆ వ్యక్తితో చెప్తాడు జాన్. అప్పుడు తనకు ఇలా జరగడానికి కారణమైన వ్యక్తిని చూపిస్తానని, ఆ అజ్ఞాత వ్యక్తి జాన్ ను టైం మిషన్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఇదివరకే ఆ టైం మిషన్ ద్వారా అతను ప్రయాణాలు మొదలుపెట్టి చాలామందిని కాపాడుతాడు. ఇప్పుడు జాన్ జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తిని టైం మిషన్ ద్వారా పట్టుకుంటాడా? ఆ అజ్ఞాత వ్యక్తి టైం మిషన్ ను దేనికి ఉపయోగిస్తాడు? ఈ విషయాలు తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే.