BigTV English

Young Woman Suicide : “నువ్వే నా ప్రాణం.. నువ్వు లేకపోతే ఉండలేనన్నాడు..” 14 పేజీల లేఖ రాసి యువతి సూసైడ్

Young Woman Suicide : “నువ్వే నా ప్రాణం.. నువ్వు లేకపోతే ఉండలేనన్నాడు..” 14 పేజీల లేఖ రాసి యువతి సూసైడ్

Young Woman Suicide in Jeedimetla : ప్రేమకు ఉన్న విలువ రోజురోజుకూ తగ్గిపోతుంది. వ్యక్తిగత అవసరాలు, శారీరక వాంఛకు కూడా ప్రేమ అనే పేరు పెట్టి.. దానికున్న పవిత్రతను దిగజారుస్తున్నారు. కొందరు కాదు.. ఈ జనరేషన్ లో చాలా మంది ప్రేమంటే ఒకరిపై ఒకరికున్న కోరికను తీర్చుకోవడంగా భావిస్తున్నారు. ఒకరిపై ఒకరికి నమ్మకం, బాధ్యత వంటివి ఉంటేనే దాన్ని ప్రేమంటారు. ప్రేమించిన వ్యక్తి మన ప్రేమను అంగీకరించకపోతే వారి నిర్ణయాన్ని గౌరవించాలే కానీ.. వేధించి, ఒప్పించి చివరికి మోసం చేసే హక్కు ఎవరికీ లేదు. ప్రేమ పేరుతో తన చుట్టూ తిరిగిన యువకుడిని నమ్మి మోసపోయిన యువతి.. 14 పేజీల లేఖ రాసి.. సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో వెలుగుచూసింది.


ఎస్సై ముంత ఆంజనేయులు తెలిపిన వివరాల మేరకు.. బాలబోయిన అఖిల (22) అనే యువతి ఎన్ఎల్ బీ నగర్లో తన పేరెంట్స్ తో కలిసి నివాసం ఉంటోంది. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న అఖిలకు షాపూర్ నగర్ కి చెందిన అఖిల్ సాయిగౌడ్ నుంచి కొన్నేళ్లుగా ప్రేమ వేధింపులు మొదలయ్యాయి. ఒప్పుకునే వరకూ వెంటపడ్డాడు. ఆమెతో ఎస్ చెప్పించాడు.

Also Read : దారుణంగా పుష్ప హత్య.. ముక్కలు ముక్కలుగా చేసి..!


అఖిల్ – అఖిలల ప్రేమ విషయం అఖిల ఇంట్లో తెలియడంతో.. యువకుడిని పిలిపించి బంధువుల సమక్షంలో మాట్లాడారు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడంతో వీరిద్దరి ప్రేమను పెద్దలు అంగీకరించారు. ఇంకేముంది పెళ్లే ఆలస్యం అని ఊహల్లో తేలిపోతున్న అఖిలకు.. అఖిల్ షాకిచ్చాడు. కొన్నాళ్లు సాఫీగా సాగిన వీరి ప్రేమాయణంలో.. మళ్లీ వేధింపులు మొదలయ్యాయి.

చిన్న చిన్న విషయాలకే హర్టయ్యే అఖిల్.. రోడ్డుమీదనే ఆమెపై చేయి చేసుకోవడం మొదలుపెట్టాడు. 3,4 నెలలుగా ఇదే జరుగుతోంది. చివరికి తనను పెళ్లిచేసుకోవడం కుదరదని తెగేసి చెప్పడంతో అఖిల మనస్తాపానికి గురైంది. “నువ్వే నా ప్రాణం.. నువ్వు లేకపోతే ఉండలేనన్నాడు.. అతని మాటలన్నీ నిజమని నమ్మి మోసపోయాను. పేరెంట్స్ మాట విని ఉంటే ఈ రోజు సంతోషంగా ఉండేదాన్ని.” అని అఖిల 14 పేజీల లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. అఖిల తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్ు చేస్తున్నారు.

Tags

Related News

Rajasthan: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. వ్యాన్- కంటైనర్ ఢీ.. స్పాట్‌‌లో 10 మంది మృతి, ఇంకా

Delhi crime news: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. స్విమ్మింగ్ పూల్ వెళ్లిన బాలికలపై అత్యాచారం!

Loan app scam: రూపాయి లోన్ లేదు కానీ.. రూ.15 లక్షలు చెల్లించిన యువతి.. షాకింగ్ స్టోరీ!

Karnataka Crime: దారుణం.. అత్తను 19 ముక్కలుగా నరికి 19 చోట్ల పడేసిన అల్లుడు

Kerala Crime: గదిలో లాక్ చేసి.. మతం మారాలంటూ ప్రియురాలిని వేధించిన ప్రియుడు.. ప్రాణాలు విడిచిన యువతి

Bus accident: ఘోర ప్రమాదం.. బస్టాండ్‌లోకి దూసుకొచ్చిన బస్సు.. స్పాట్‌లోనే..?

Big Stories

×