Nivetha Pethuraj Video Viral: ప్రముఖ నటి నివేదా పేతురాజ్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, తమిళ్ వంటి భాషల్లో ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. గతంలో విశ్వక్ సేన్‌తో పాగల్, అలాగే గతేడాది ధమ్కీ చిత్రాలలో నటించి మంచి క్రేజ్ అందుకుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో ప్రకారం.. ఆమె కారును పోలీసులు చెకింగ్ కోసం ఆపారు. అనంతరం ఆమె కారు డిక్కీ ఓపెన్ చేయమంటే.. అందుకోసం నివేదా సహకరించలేదు.
కావాలంటే కారుకు సంబంధించిన అన్ని పేపర్లు ఉన్నాయని అవి చెక్ చేయమంది.. అంతేకాని కారు డిక్కీ మాత్రం ఓపెన్ చేయనని తెలిపింది. దీంతో పోలీసులు తమకు సహకరించాలని.. మీరు కూడా ఈవిధంగా మొండికేస్తే ఎలా అని అనడంతో ఆమె కాస్త కంగారుగా కనిపించింది. అంతేకాకుండా పోలీసులు నివేదా కారు డిక్కీ ఓపెన్ చేయమంటే.. ఆమె ఓపెన్ చేయకుండా అది తమ ఫ్యామిలీ పరువుకు సంబంధించినది అని చెప్పడం మరింత ఆసక్తికరంగా మారింది.
అయితే అదే సమయంలో ఆ సంఘటనను వీడియో తీస్తుండగా ఆమె చూసి ఎందుకు వీడియో రికార్డు చేస్తున్నారు అంటూ కారు దిగడం వీడియోలో చూడవచ్చు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. ఒకరేమో నిజంగా నివేదా పేతురాజ్ తన కారు డిక్కీలో ఏమైనా తీసుకెళ్తుందా? ఏమీ తీసుకెళ్లకపోతే డిక్కీ ఓపెన్ చేయడానికి ఎందుకు భయపడుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Also Read: విశ్వంభర సెట్స్‌లో ఊహించని స్టార్.. 30 ఏళ్ల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో
మరికొందరేమో.. ఈ వీడియో చూస్తుంటే ఏదో సినిమా ప్రమోషన్స్ కోసం చేస్తున్నట్లు అనిపిస్తుందని అంటున్నారు. నివేదా పేతురాజ్ ఎక్స్‌ప్రెసెన్స్ కూడా యాక్టింగ్ చేసినట్లు కనిపిస్తున్నాయని కామెంట్లు చేస్తున్నారు. మరి నివేదాను పోలీసులు నిజంగానే ఆపారా? లేక ఇదంతా సినిమా ప్రమోషన్స్ కోసం చేస్తున్నారా అనేది తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.
#News @Nivetha_Tweets pic.twitter.com/hWuwfpvj3N
— devipriya (@sairaaj44) May 30, 2024