E-Paper
Advertisement

Jyotirlinga Darshan: పన్నెండు రాశులకు పన్నెండు జ్యోతిర్లింగాలు – ఏ రాశి వారు ఏ లింగాన్ని దర్శించుకోవాలో తెలుసా..?

Jyotirlinga Darshan: పన్నెండు రాశులకు పన్నెండు జ్యోతిర్లింగాలు – ఏ రాశి వారు ఏ లింగాన్ని దర్శించుకోవాలో తెలుసా..?

Jyotirlinga Darshan: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పన్నెండు రాశులకు పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయని పండితులు చెప్తున్నారు. అయితే ఒక్కో రాశి వారు ఆయా రాశికి సంబంధించిన జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించుకోవాలని సూచిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి: ఈ రాశి జాతకులు తమిళనాడులోని రామేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే వారికి అంతా మంచే జరుగుతుందట. అయితే రామేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నప్పుడు ఈ కింది శ్లోకం పఠించాలట.

శ్లోకం: “సుతామ్ర పర్ణీ జలరాశి యోగే, నిబధ్య సేతుం విశిఖైర సంఖ్యై

శ్రీరామ చంద్రేన సమర్పితం తం, రామేశ్వరాఖ్యం నియతం నమామి.”

వృషభ రాశి: ఈ రాశిలో పుట్టిన వారు గుజరాత్‌లోని సోమనాథ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలని సూచిస్తున్నారు. వీరు పఠించాల్సిన

శ్లోకం:”సౌ రాష్ట్ర దేశే విదేశే తిరమ్యే జ్యోతిర్మయం చంద్ద్ర కళావ సంతం,

భక్తి ప్రాధానాయ క్రుపావతీర్ణం తం సోమనాధం శరణం ప్రపద్యే.”

 

మిథున రాశి: ఈ రాశి జాతకులు తమ జీవితంలో తప్పకుండా దర్శించాల్సిన జ్యోతిర్లింగం నాగేశ్వర జ్యోతిర్లింగం. ఇది మహరాష్ట్రలో ఉంది. ఈ రాశి జాతకులు పఠించాల్సిన

శ్లోకం:”యామ్యే సదంగే నగరే తిరమ్యే విభ్శితాంగం వివిధైశ్చ భొగై ,

సద్భక్తి ముక్తి ప్రదమేకం, శ్రీ నగనాధం శరణం ప్రపద్యే.”

 

కర్కాటక రాశి: ఈ రాశి జాతకులు జీవితంలో ఒక్కసారైనా  “ఓం కార జ్యోతిర్లింగం” క్షేత్రాన్ని దర్శించాలట. అలాగే అక్కడ స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత ఈ కింది శ్లోకం పఠించాలట.

శ్లోకం: “కావేరికా నర్మదాయో పవిత్రే , సమాగమే సజ్జన తారణాయ,

సదైవమాన్దాత్రు పురే వసంతం, ఓం కారమీశం శివమే మీడే”

 

సింహరాశి : సింహ రాశిలో పుట్టిన జాతకులు తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రం..  “శ్రీ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం” ఇది కూడా మహారాష్ట్రలో ఉంది. ఈ క్షేత్రంలో పరమశివుడిని దర్శించుకున్న తర్వాత ఈ కింది శ్లోకం పఠించాలట.

శ్లోకం: “ఇలాపురే రమ్య విశాల కేస్మిన్ సముల్ల సంతం చ జగద్వ రేణ్యం,

వందే మహా దారాతర స్వభావం, ఘ్రుశ్నేస్వరాఖ్యం శరణం ప్రపద్యే.”

 

కన్యా రాశి: ఈ రాశిలో పుట్టిన జాతకులు ముఖ్యంగా దర్శించాల్సిన జ్యోతిర్లింగ క్షేత్రం “శ్రీశైల జ్యోతిర్లింగం”. ఇక్కడి స్వామిన దర్శించుకునే సమయంలో పఠించాల్సిన

శ్లోకం: “శ్రీ శైల శ్రుంగే విభుధాతి సంగే తులాద్రి తుంగే పి ముదావసంతం.

తమర్జునం మల్లిక పూర్వ మేకం, నమామి సంసార సముద్ర సేతుం.”

 

తులారాశి: ఈ రాశిలో పుట్టిన జాతకులు దర్శించాల్సిన జ్యోతిర్లింగ క్షేత్రం “మహాకాళే శ్వరం” జ్యోతిర్లింగం. ఈ స్వామిని దర్శించుకునే సమయంలో పఠించాల్సిన

శ్లోకం: “అవన్తికాయాం విహితావరం, ముక్తి ప్రధానాయ చ సజ్జనానాం,

అకాల మృత్యో : పరిరక్ష ణా ర్థం వందే మహాకాల మహాసురేశం “

 

వృశ్చిక రాశి: ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు తప్పకుండా దర్శించుకోవాల్సిన క్షేత్రం “వైద్యనాదేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం. వీరు పఠించాల్సిన

శ్లోకం: “పూర్వొత్తరె ప్రజ్వాలికానిధానే , సాదావసంతం గిరిజాసమేతం

 నురాసురారాదిత పాదపద్మం, శ్రీ వైద్య నాదం తమహం నమామి.”

 

ధనస్సు రాశి : ఈ రాశి జాతకులు జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన క్షేత్రం ” కాశీ విశ్వేశ్వర లింగం” ఈ స్వామిని దర్శించినప్పుడు తప్పకుండా పఠించాల్సిన

శ్లోకం: “సానంద వనే వసంతం, ఆనందకందం హత పాప బృందం,

వారణాసీనాధ మనాద నాదం, శ్రీ విశ్వ నాదం శరణం ప్రపద్యే.”

 

మకర రాశి: ఈ రాశి జాతకులు తమ జీవితంలో తప్పకుండా దర్శించుకోవాల్సిన జ్యోతిర్లింగ క్షేత్రం “భీమ శంకర జ్యోతిర్లింగ క్షేత్రం” వీరు పఠించాల్సిన

శ్లోకం: “యం డాకినీ శాకినికాసమాజై నిషేవ్యమాణం పిశితా శనైశ్చ,

సదైవ భీమాది పద ప్రసిధం, తం శంకరం భూత హితం నమామి.”

 

కుంభ రాశి: ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రం “కేదారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం” వీరు పఠించాల్సిన

శ్లోకం: “మహాద్రి పార్శ్వే చ రమంతం, సంపూజ్య మానం సతతం మునీన్ద్రై :

సురాసురై ర్యక్ష మహోర గాద్యై : కేదారమీశం శివమేక మీడే “

 

మీన రాశి: మీనరాశిలో పుట్టిన వ్యక్తులు తప్పకుండా తమ జీవితంలో దర్శించాల్సిన జ్యోతిర్లింగ క్షేత్రం “త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం.” వీరు పఠించాల్సిన

శ్లోకం:”సహ్యాద్రి శీర్షే విమలే వసంతం, గోదావరీ తీర పవిత్ర దేశే ,

యద్దర్శనాథ్ పాతక మాశు నాశం, , ప్రయాతి తం త్రయంబక మీశ మీడే “

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: కురుక్షేత్రంలో కృష్ణుడు పూరించిన శంఖం స్పెషల్ ఏంటో తెలుసా – ఇంకా ఎవరెవరు శంఖం పూరించేవారంటే..?

 

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×