E-Paper
Advertisement

Kurukshetra: కురుక్షేత్రంలో కృష్ణుడు పూరించిన శంఖం స్పెషల్ ఏంటో తెలుసా – ఇంకా ఎవరెవరు శంఖం పూరించేవారంటే..?

Kurukshetra: కురుక్షేత్రంలో కృష్ణుడు పూరించిన శంఖం స్పెషల్ ఏంటో తెలుసా – ఇంకా ఎవరెవరు శంఖం పూరించేవారంటే..?

Kurukshetra: కురుక్షేత్రంలో కృష్ణుడు పూరించిన శంఖారావం పవరేంటో..? తెలుసా..? ఆ శంఖానాదానికి కౌరవుల గుండెలు అదిరిపోయేవని ఎంతమందికి తెలుసు.. ఇంకా మహాభారతంలో ఎంత మంది శంఖం పూరించేవారో తెలుసా..? కృష్ణుడి శంఖంతో పాటు మిగతా వాళ్లు పూరించే శంఖాలకు ఉన్న పేర్లేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

మహాభారతంలో కృష్ణుడు ఎంతటి పవర్‌ఫుల్లో ఆయన చేతిలో ఉన్న శంఖం అంతే పవర్‌ఫుల్‌. ఒక్కసారి కృష్ణుడు శంఖం పూరిస్తే.. శత్రువుల గుండెలు జారిపోయేవట. ఆ శంఖానాదానికి అంతటి పవర్‌ ఉండేదటని భారతంలోనే ఉన్నట్టు పండితులు చెప్తుంటారు. అయితే భారతంలో శ్రీకృష్ణుడే కాకుండా ఇంకా చాలా మంది శంఖం పూరించేవారట. అదే విషయం భగవద్గీత మొదటి ఆధ్యాయంలో 15, 16వ శ్లోకాల్లో ఉందని పండితులు చెప్తున్నారు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 శ్రీకృష్ణుడు – పాంచజన్యం (Panchajanya):

సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ పూరించిన శంఖం పేరు ‘పాంచజన్యం’. అంటారట. ఈ పాంచజన్యాన్నే కృష్ణుడు అనేక సందర్భాలలో పూరించేవారని చెప్తుంటారు. ఈ శంఖానాదం వచ్చిందంటే రాక్షస నాశనానికి ముహూర్తం ఫిక్స్‌ అయినట్టేనని.. ధర్మ సంస్థాపన మొదలైనట్టేనని నమ్మేవారు. పాంచజన్యం శబ్దానికి అంత ప్రియారిటీ ఉండేదట.

అర్జునుడు – దేవదత్తం (Devadatta):

మహా భారతంలో శ్రీ కృష్ణుడే కాదు అర్జునుడు కూడా శంఖం పూరించేవాడు. అయితే అర్జునుడి శంఖం పేరు దేవదత్తం. ఈ దేవదత్తాన్ని అర్జునుడికి ఇంద్రుడు బహుమతిగా ఇచ్చాడట. శ్రీకృష్ణుడి తర్వాత అంత ప్రాచుర్యం పొందింది అర్జునుడి దేవదత్తమేనని అంటారు.

భీముడు – పౌండ్రం (Paundra):

పాండవులలో రెండో వాడు.. వెయ్యి ఏనుగుల బలం ఉన్న భీముడు కూడా శంఖానాదం చేసేవాడట. అయితే భీముడి శంఖం పేరు పౌండ్రం. ఇది భీముడు పూరిస్తే శత్రువుల గుండెలు అదిరిపోయేవని.. ఆ శంఖం శబ్దం వినే భీముడు కదనరంగంలో ఉన్నాడని శత్రువులు అర్థం చేసుకునేవారట.

ధర్మరాజు – అనంతవిజయం (Anantavijaya):

కుంతీపుత్రుడు, పాండవులలో పెద్దవాడు ధర్మానికి ప్రతిరూపమైన ధర్మరాజు కూడా శంఖం పూరించేవాడట. ధర్మరాజు శంఖం పేరు అనంతవిజయం. ఈ అనంత విజయమే ధర్మరాజుకు కురుక్షేత్ర యుద్దంలో అన్నంతమైన విజయాన్ని అందించింది అంటారు. అందుకే ఈ శంఖం విజయానికి సూచికగ బావిస్తారు.

 నకులుడు – సుఘోషం (Sughosha):

పాండవులలో నాలుగవ వాడు నలుకుడు.. మహా బలవంతుడైన నకులుడు కూడా శంఖం పూరించేవాడట. ఆయన పూరించే శంఖాన్ని సుఘోషం అని పిలుస్తారట. సుఘోషం అంటే మంచి శబ్దం, లేదా నాదం అని అర్థం వస్తుందట. నకులుడు ఆ సుఘోషను ఉపయోగించే ఎన్నో రకాలైన గోవులను వశ్యం చేసుకునేవాడని పండితులు చెప్తుంటారు.

సహదేవుడు – మణిపుష్పకం (Manipushpaka):

పాండవులలో చివరి వాడు.. శాంత స్వభావం కలవాడైన గొప్ప వీరుడు సహదేవుడు కూడా శంఖం పూరించేవాడట. సహదేవుని శంఖం పేరు మణిపుష్పకం. మణిపుష్పకం అంటే మంచి రత్నాలతో కూడిన పుష్పం అని అర్థం. ఈ శంఖం పూరించే సహదేవుడు ఎవ్వరికీ లొంగని గోవులు, గుర్రాలను మచ్చిక చేసుకునే వాడట.

కురుక్షేత్ర యుద్దంలో ఈ శంఖాలన్నీ ఒక్కసారిగా మోగితే ఆ శబ్దం ఆకాశాన్ని, భూమిని దద్దరిల్లేలా చేసి.. కౌరవుల గుండెలు  బద్దలయ్యేలా చేసేవని మహాభారతంలో వ్యాసుడు వర్ణించాడు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: కుక్కతో మొదలైన భారతం కుక్కతోనే ముగుస్తుందట – వ్యాస భారతంలో ఎన్ని మిస్టరీలో తెలుసా..?

 

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×