E-Paper
Advertisement

Vastu Tips For kitchen: వంట గదిలో ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం మీ సొంతం.

Vastu Tips For kitchen: వంట గదిలో ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం మీ సొంతం.
Advertisement

Vastu tips for kitchen: వంట గది అనేది ఇంట్లో అత్యంత ముఖ్యమైన ప్రదేశం. ఇది ఆహారాన్ని తయారు చేసుకునే ప్రదేశం. అయినప్పటికీ ఇంటికి వాస్తు ఎంత అవసరమో ప్రత్యేకంగా వంట గదికి కూడా అవసరమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వంటగదిలో కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా శ్రేయస్సు కలుగుతుందని అంటున్నారు.

1. వంటగది ఇంటిలో అంతర్భాగం. వంట గదిని విషయానికొస్తే నిర్మాణంలో కొన్ని నియమాలు పాటించడం ముఖ్యం.ప్రతీ ఇంట్లో వంటగది ఆగ్నేయ దిశలో ఉండాలి.

Advertisement

2. ఆగ్నేయ దిశలో వంట చేయడం వల్ల ఇంట్లో ఉన్న వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతే కాకుండా కుటుంబానికి కూడా శ్రేయస్సు లభిస్తుంది. ఆగ్నేయ దిశలో వంట గది కట్టుకోవడానిక కుదరకపోతే ఆగ్నేయం, తూర్పు, పడమర- దక్షిణదిశలో వంటగది నిర్మించుకోవచ్చు.

3. వంటగదిలో స్టవ్ లేదా బర్నల్ ను ఆగ్నేయ దిశలో ఉంచండి. వంట చేసే వ్యక్తి తూర్పు ముఖంగా ఉండి ఆహారాన్ని సిద్ధం చేయాలి. ఇది ఇంట్లో ఉన్న వారికి అదృష్టం, శ్రేయస్సును తెస్తుంది .

Advertisement

4. అగ్నిని సంబంధించిన హీటర్, ఓవెన్ వంటివి అన్ని గాడ్జెట్‌లను ఆగ్నేయ దిశలోనే ఉంచండి.

5. మిక్సర్, గ్రైండర్ వంటి ఇతర గాడ్జెట్లను వాయువ్య దిశలో ఉంచడం మంచిది.

6. రిఫ్రిజిరేటర్ ను తప్పనిసరిగా పశ్చిమ దిశలోనే ఉంచాలి.

7. పప్పులు, సుగంధ ద్రవ్యాలు, ఇతర ఆహార పదార్థాలు నిల్వ చేయడానికి మీ కిచెన్ లో దక్షిణ, పశ్చిమ దిశలను ఉపయోగించండి.

8. స్టౌ బర్నర్ పక్కన మీ వంట గది సింక్‌ను తయారు ఉంచుకోవడం మానుకోండి. నీటికి సంబంధించిన మూలకాన్ని అగ్ని పక్కన ఉంచడం వల్ల ఇంట్లో శక్తుల అసమతుల్యత కలుగుతుంది. ఒక వేళ అలా ఇప్పటికే ఇలా ఉన్నట్లయితే పాల రాయి లేదా గ్రానైట్ గోడ గ్యాస్ కు, సింక్ మధ్య నిర్మించండి.

9. వాష్ బేషిన్ లేదా సింక్ ఈశాన్యదిశలో, వంటగదిలో ఉత్తరం వైపు లేదా పశ్చిమ వైపు ఉండాలి.

10. సరైన దిశలో వంట గది లేకపోతే శక్తి యొక్క సహజ ప్రవాహానికి అంతరాయం కలిగుతుంది.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×