E-Paper
Advertisement

Rasam Idly: కూల్ వెదర్ లో వేడి వేడి రసం ఇడ్లీ.. సాంబార్ ఇడ్లీ దిగదుడుపే

Rasam Idly: కూల్ వెదర్ లో వేడి వేడి రసం ఇడ్లీ.. సాంబార్ ఇడ్లీ దిగదుడుపే
Advertisement

Rasam for Idly Recipe: చాలా మందికి సాంబార్ ఇడ్లీ అంటే ఎంతో ఇష్టం. కానీ.. ఎప్పుడైనా రసం ఇడ్లీ తిన్నారా ? ఛీ అదేంటి.. రసంతో ఇడ్లీ .. అని అనుకుంటున్నారా? చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే సాంబార్ ఇడ్లీ కంటే ఇదే బాగుందని చెప్తారు. ఇదే మీ ఫేవరెట్ బ్రేక్ ఫాస్ట్ అవుతుంది కూడా. కావాలంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. అక్కడక్కడా పచ్చికొబ్బరి తురుము తగులుతూ.. పుల్లపుల్లగా వేడి వేడి రసం గొంతులోకి దిగుతుంటే భలే బాగుంటుంది.

రసం తయారీకి కావలసిన పదార్థాలు

Advertisement

టొమాటోలు – 5-6

మునక్కాడ ముక్కలు – 4-5

Advertisement

సన్నగా తరిగిన కొత్తిమీర

పచ్చికొబ్బరి తురుము – 2 స్పూన్లు

రసం/ సాంబారు పొడికి కావలసిన పదార్థాలు

ధనియాలు – 1/4 కప్పు

జీలకర్ర – 1 టేబుల్ స్పూన్

మెంతులు – కొద్దిగా

మిరియాలు – 1 టేబుల్ స్పూన్

ఎండుమిర్చి – గుప్పెడు

బియ్యం- 2 టేబుల్ స్పూన్లు

నూనె – కొద్దిగా

Also Read: బ్యాచిలర్స్ కోసం లంచ్ బాక్స్ రెసిపీ.. నిమిషాల్లో చేసుకోవచ్చు..

రసం తయారీ విధానం

కళాయిలో నూనె వేసి .. వేడయ్యాక రసం పొడి తయారీకి చెప్పిన పదార్థాలు బియ్యం మినహా మిగతా దినుసులన్నీ వేసుకుని పచ్చివాసన పోయేంతవరకూ కరకరలాడేలా వేయించుకోవాలి. చివరిలో బియ్యం కూడా వేసి మాడకుండా వేయించుకుని చల్లారబెట్టుకోవాలి. వీటన్నింటినీ మిక్సీ జార్ లో వేసి, అందులోనే చిటికెడు కల్లుప్పు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. సాంబార్ లోకి కూడా దీనిని వాడుకోవచ్చు.

ఇప్పుడు టొమాటోలను తీసుకుని.. వాటిపై తలలను తీసేసి.. నాలుగువైపులా గాట్లు పెట్టుకోవాలి. ఒక గిన్నె నిండా నీరు పోసి.. అందులో టొమాటోలు, మునక్కాడ ముక్కలు, రుచికి సరిపడా కల్లుప్పు, చిటికెడు పసుపు వేసి బాగా ఉడికించుకోవాలి. ఉడికిన టొమాటోలను నీటిలో నుంచి తీసేసి చల్లారబెట్టుకోవాలి.

టొమాటోలు చల్లారిన తర్వాత తొక్కలను శుభ్రంగా తీసేసి.. మిక్సీ జార్ లో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను మరుగుతున్న నీటిలో వేసి మరిగించుకోవాలి. అందులోనే కొబ్బరి తురుము, కొత్తిమీర, 2 స్పూన్లు తయారు చేసుకున్న రసంపొడి వేసి కలపాలి. బాగా మరిగించుకోవాలి. ఇందులే చింతపండు గుజ్జు వేసుకోనక్కర్లేదు. మీకు నచ్చితే కొద్దిగా బెల్లం వేసుకోండి.

కడాయిలో కొద్దిగా నూనె వేసి.. కొద్దిగా ఆవాలు, కరివేపాకు మాత్రమే వేసి వేయించుకుని రసంలో తాలింపు పెట్టాలి. అప్పుడే వేసుకున్న వేడి వేడి ఇడ్లీల్లో ఈ రసం కలుపుకుని తింటే.. సూపర్ అంటారు. ఈ రసం ఇడ్లీల్లోకే కాదు.. విడిగా తాగడానికి కూడా చాలా బాగుంటుంది. జలుబు చేసినా, గొంతు బాలేకపోయినా వేడి వేడిగా ఈ రసం తాగితే బెటర్ ఫీలింగ్ ఉంటుంది.

Related News

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్నో ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

Big Stories

Advertisement
×