E-Paper
Advertisement

Lord Hanuman: మీ కుటుంబంపై హనుమంతుని రక్షణ ఉందా ? ఈ 9 సంకేతాలతో తెలుసుకోండి !

Lord Hanuman: మీ కుటుంబంపై హనుమంతుని రక్షణ ఉందా ? ఈ 9 సంకేతాలతో తెలుసుకోండి !
Advertisement

Lord Hanuman: హనుమంతుడు చిరంజీవి. భక్తుల పిలుపు విని ఆపదలో ఆదుకునే దైవంగా ఆంజనేయ స్వామిని కొలుస్తారు. చాలా ఇళ్లలో స్వామివారి అనుగ్రహం వల్ల కొన్ని వింతలు, విశేషాలు జరుగుతుంటాయి. అయితే అవి కేవలం కాకతాళీయమా లేక స్వామివారి కృప వల్ల జరుగుతున్నాయా అనేది భక్తులకు కలిగే సందేహం. మీ కుటుంబంపై స్వామివారి రక్షణ కవచం ఉందని చెప్పడానికి ప్రకృతి కొన్ని రహస్య సంకేతాలను ఇస్తుంది. ఆ తొమ్మిది శుభ సంకేతాల గురించి తెలుసుకోవడం వల్ల మనలో భక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఆ సంకేతాలివే..

మీ కుటుంబంపై హనుమంతుని కృప ఉందని చెప్పే 9 సంకేతాలు:

Advertisement

1. ఆకస్మిక సుగంధం:
మీ పూజ గదిలో లేదా ఇంట్లో ఎటువంటి ధూపం వేయకపోయినా.. అకస్మాత్తుగా మల్లెపూల సువాసన లేదా చందనం వాసన వస్తుంటే.. అది హనుమంతుని ఉనికికి సంకేతం. స్వామి వారు అదృశ్య రూపంలో మీ ఇంటిని దర్శించారని దీని అర్థం.

2. కోతుల దర్శనం:
మీ ఇంటి సమీపంలోకి తరచుగా కోతులు రావడం లేదా అవి మీకు ఎలాంటి హాని చేయకుండా ప్రశాంతంగా ఉండటం గమనించారా? శాస్త్రాల ప్రకారం.. వానర రూపంలో స్వామివారు మీ క్షేమాన్ని పర్యవేక్షిస్తున్నారని నమ్ముతారు.

Advertisement

3. కలలో వానర దేవుడు కనిపించడం:
మీ కలలో తరచుగా హనుమంతుని విగ్రహం, దేవాలయం లేదా కోతులు కనిపిస్తుంటే.. మీ కుటుంబంపై స్వామివారి రక్షణ ఉందని అర్థం. ఇది ఆపదలు తొలగిపోతాయని చెప్పే శుభ సూచన.

4. రామ నామం వినబడటం:
మీరు అనుకోకుండా బయటకు వెళ్ళినప్పుడు లేదా ఇంట్లో ఉన్నప్పుడు ‘రామ నామం’ లేదా ‘హనుమాన్ చాలీసా’ వినబడటం జరిగితే.. అది స్వామివారు మిమ్మల్ని పలకరిస్తున్నట్లు భావించాలి.

5. కష్టాల నుంచి ఆకస్మిక విముక్తి:
పెద్ద ప్రమాదం జరగబోయి తృటిలో తప్పించుకోవడం లేదా తీరని ఆర్థిక సమస్యలు అకస్మాత్తుగా పరిష్కారం అవ్వడం స్వామివారి అభయహస్తం వల్లే సాధ్యం.

6. ధైర్యం, మానసిక ప్రశాంతత:
ఎంతటి కష్టకాలంలోనైనా మీ మనసు స్థిరంగా ఉండి, విపరీతమైన ధైర్యం కలుగుతుంటే.. అది ఆంజనేయుడు మీకు ప్రసాదించిన శక్తి అని గుర్తించాలి.

Also Read: మీ ఇంటికి లక్ష్మీదేవి రావాలా? అయితే మెయిన్ డోర్ దగ్గర ఈ మొక్కలు ఉండాల్సిందే !

7. దీపంలో ఆకృతి:
మీరు పూజ చేసేటప్పుడు దీపపు జ్యోతి హనుమంతుని ఆకారంలో లేదా గద ఆకారంలో కనిపించడం చాలా అరుదైన, శక్తివంతమైన సంకేతం.

8. అతిథుల రాకతి:
మీ ఇంట్లో సుందరకాండ పారాయణం చేస్తున్నప్పుడు లేదా హనుమాన్ చాలీసా చదువుతున్నప్పుడు.. ఎవరైనా సాధువులు లేదా అతిథులు పిలవకుండానే రావడం స్వామివారి కృపకు నిదర్శనం.

9. పక్షుల కిలకిలారావాలు:
ఉదయాన్నే మీ ఇంటి గుమ్మం దగ్గర పిచ్చుకలు లేదా పక్షులు సందడి చేయడం, ప్రశాంతమైన వాతావరణం నెలకొనడం కూడా సానుకూల శక్తికి, దైవ అనుగ్రహానికి సంకేతాలు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×