Numerology: ప్రతి మనిషిలోనూ ఏదో ఒక గుణం ఉంటుంది. కొంతమంది స్వతహాగా మృదువైన మాట తీరును కలిగి ఉంటారు. మరికొందరు తమ మాటలతో ఇతరుల మనస్సును గెలుస్తారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం.. మూల సంఖ్య ఆధారంగా వ్యక్తిత్వం గురించి మనం చాలా తెలుసుకోవచ్చు. ఈ రోజు సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ తేదీల్లో పుట్టిన వారు మాటల మాంత్రికులుగా ఉంటారు. ఎవరు మాటలతో కీర్తిని సంపాదిస్తారనే విషయాలను గురించిన పూర్తి విషయాలను తెలుసుకుందాం.
సంఖ్యాశాస్త్రం ప్రకారం.. ఏ నెలలోనైనా 5, 14 లేదా 23 తేదీలలో జన్మించిన వ్యక్తుల యొక్క మూల సంఖ్య 5. ఈ సంఖ్యను పాలించే గ్రహం బుధుడు. దీనిని జ్యోతిష్యశాస్త్రంలో తెలివితేటలు, వాక్కు, తార్కికం, కమ్యూనికేషన్, వ్యాపారం, చర్మానికి కారకంగా పరిగణిస్తారు. బుధ గ్రహ ప్రభావం వల్ల.. ఈ తేదీల్లో పుట్టిన వ్యక్తులు అద్భుతమైన సంభాషణా నైపుణ్యాలు, పదునైన ఆలోచనా సామర్థ్యం, అద్భుతమైన విశ్లేషణాత్మక విధానాన్ని క్రమంగా అభివృద్ధి చేసుకుంటారు.
5 మూల సంఖ్య ఉన్న వ్యక్తులు సహజంగానే చాలా తెలివైనవారు. అంతే కాకుండా కళల్లో నిష్ణాతులు . వీరికి సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు . క్లిష్ట పరిస్థితుల్లో కూడా సులభంగా బయటపడే మార్గాన్ని కనుగొంటారు. మాట్లాడటంలో చాలా నైపుణ్యం కలిగి ఉంటారు. అంతే కాకుండా ముందు ఉన్న వ్యక్తి వీరి మాటలకు అభిమాని అయిపోతారు.
మాట్లాడే కళలో ప్రావీణ్యం:
ఈ తేదీల్లో పుట్టిన వారి ప్రసంగంలో ఒక ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. దాని కారణంగా వారు ఇతరులను వారి వైపు సులభంగా తిప్పుకుంటారు. మాట్లాడే నైపుణ్యాలు ప్రతి సందర్భంలోనూ వారిని ప్రత్యేకంగా నిలబెడతాయి. ఈ వ్యక్తులపై సరస్వతి దేవి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు.
Also Read: సూర్యుడు, చంద్రుడి సంచారం.. ఏప్రిల్ 28 నుండి వీరు పట్టిందల్లా బంగారం
వ్యాపారంలో విజయం:
నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ముందుంటారు. అందుకే ఉద్యోగాల కంటే వ్యాపారంలోనే మెరుగ్గా రాణిస్తారు. రిస్క్ తీసుకునే ధైర్యం ఉంటుంది. సమస్యలకు ఈజీగా భయపడరు. ఈ వ్యక్తులు రాజకీయాలు, వ్యాపారం లేదా కళ వంటి రంగాలలో మంచి పేరు సంపాదిస్తారు.
వ్యాపారంలో విజయం:
సంగీతం , ఆర్థిక శాస్త్రంలో కూడా వీరు ఆసక్తి కలిగి ఉంటారు. పరిస్థితులు ఏమైనప్పటికీ.. తమను తాము మార్చుకోవడంలో నిపుణులు. అంతేకాకుండా.. కొత్త వ్యక్తులతో త్వరగా స్నేహం చేస్తారు. ఇతరుల మనస్సులో ఏముందో అర్థం చేసుకునే అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. డబ్బు గురించి చాలా మంచి అవగాహన ఉంటుంది. డబ్బు బాగా సంపాదిస్తారు.