BigTV English

Ghost Sightings: ఈ దేశాల్లో దెయ్యాలు ఎక్కువ.. నిత్యం కనిపిస్తూనే ఉంటాయట, మరి ఇండియాలో?

Ghost Sightings: ఈ దేశాల్లో దెయ్యాలు ఎక్కువ.. నిత్యం కనిపిస్తూనే ఉంటాయట, మరి ఇండియాలో?

Big TV Live Originals: దెయ్యాల కథలు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. దెయ్యాల గురించి ఎవరైనా చెప్తుంటే విన్నప్పుడు ఒళ్లంతా చల్లటి చెమటలు పట్టేస్తాయి. హర్రర్ సినిమా చూస్తున్నప్పుడు దెయ్యం సీన్ వస్తే, అది నిజం కాదని తెలిసినా గుండె ఝల్లుమంటుంది. ఎవరైనా దెయ్యం కనిపించిందని చెప్తే పైప్రాణాలు పైకే పోతాయి. అలాంటిది నిజంగానే దెయ్యాలు తిరిగే ప్లేస్ గురించి వింటే? నిజంగానే దెయ్యాలు సంచరిస్తున్నాయన్న ఆధారాలు ఉండే ప్రదేశానికి వెళ్తే ఎలా ఉంటుంది…?


దెయ్యాలు ఉన్నాయని చెప్పడానికి సైన్స్ పరంగా ఎలాంటి ఆధారాలు లేవు. కానీ, దెయ్యాలు నిజంగానే ఉన్నాయని, తమకు కనిపిస్తాయని చాలా మంది చెబుతారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత దెయ్యాలు ఉన్నాయని అప్పుడప్పుడు వాటికి సంబంధించిన వీడియోలు కూడా తెగ వైరల్ అవుతాయి. వీటిని చూస్తే దెయ్యాలు నిజంగానే ఉన్నాయా అనిపిస్తుంది. అలాంటి ప్రదేశాలు ఇప్పటికీ ఉన్నాయంటే నమ్ముతారా? నిజంగానే దెయ్యాలు ఉన్నాయని చెప్పే ప్రదేశాలు ఈ ప్రపంచంలో చాలానే ఉన్నాయి. చాలా దేశాల్లో దెయ్యాలకు సంబంధించిన చారిత్రక రికార్డులు కొన్ని ప్రదేశాల్లో ఉంటే, దెయ్యాలు ఎక్కువగా తిరుగుతాయని ఆయా ప్రాంతాల్లో ఉండే నమ్మకాలు,కొన్ని చోట్ల అయితే పారానార్మల్ యాక్టివిటీస్ కూడా జరుగుతాయి. అలాంటి ప్రదేశాలు ఎక్కడున్నాయంటే..

ఒకే ఉర్లో 16 దెయ్యాలు..!
యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ఇంగ్లాండ్.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత భయంకరమైన ప్రదేశమట. ఇంగ్లండ్‌లో ఎక్కువగా దెయ్యాలు కనిపిస్తాయని చెబుతారు. టవర్ ఆఫ్ లండన్‌లో ఆన్ బోలిన్ అనే దెయ్యం ఉందట. కెంట్‌లోని ప్లక్లీ అనే గ్రామంలో 12-16 దెయ్యాలు ఉన్నాయని అక్కడి ప్రజలు చెబుతారు. అక్కడ ఉండే పురాతనమైన కోటలు, యుద్ధభూములు ఈ కథలకు మరింత బలాన్నిస్తాయి.


వేల కొద్ది దెయ్యాలే..
అమెరికాలోని టెక్సాస్‌లో 2005 నుండి 6,845 వరకు దెయ్యాలు కనిపించాయని అక్కడ ఉండే వారు చెబుతారు. ఒక్క కాలిఫోర్నియాలోనే 6,444 దెయ్యాలు ఉన్నట్లు తెలుస్తోంది. టెక్సాస్‌లో జరిగిన సివిల్ వార్‌లో చనిపోయిన 50,000 మంది సైనికులు దెయ్యాలుగా మారినట్లు ప్రచారం జరుగుతోంది.

దెయ్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చే దేశం ఒహియో. ఒహియోలో దెయ్యాలకు సంబంధించినవి దాదాపు 2,555 రికార్డులు ఉన్నాయి. గెట్టిస్‌బర్గ్ అనే యుద్ధభూమిలో పోరాడి చనిపోయిన సైనికులు దెయ్యాలుగా మారినట్లు ప్రజలు నమ్ముతారు. కాలిఫోర్నియా దగ్గర ఉన్న లాంగ్ బీచ్‌లోని RMS క్వీన్ మేరీలో 50కి పైగా దెయ్యాలు కనిపించాయని చెబుతారు.

ఆత్మహత్యల అడవి.. అందులో వింత శబ్ధాలు
జపాన్‌లో ఉన్న షింటో, బౌద్ధ నమ్మకాల కారణంగా అక్కడ దెయ్యాల కథలు ఎక్కువగా వినిపిస్తాయి. అయోకిగహారా అడవిని ఆత్మహత్యల అడవి అని కూడా పిలుస్తారట. దట్టమైన ఈ అడవిలో చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. అందుకే ఆ అడివిలో వందల కొద్ది దెయ్యాలు ఉన్నాయని స్థానికులు చెబుతారు. ఈ అడవి నుంచి చాలా సార్లు వింత వింతగా శబ్దాలు వినిపిస్తాయట. కొన్ని సార్లు భయంకరమైన అరుపులు కూడా వినిపిస్తాయని అక్కడి ప్రజలు చెబుతారు. జపాన్‌లోని హషిమా ద్వీపంలో కూడా దెయ్యాలు కనిపిస్తాయని చెబుతారు.

మన దేశంలో?
ఇతర దేశాల్లో లాగానే ఇండియాలో కూడా కొన్ని చోట్ల దెయ్యాలు తిరుగుతాయని కొందరు నమ్ముతారు. రాజస్థాన్‌లోని భంగర్ కోటలో దెయ్యాలు ఉన్నాయని చాలా మంది చెబుతారు. కొందరికి ఈ కోటలో దెయ్యాలు కనిపించాయట. అంతేకాకుండా ఆ ప్రాంతంలో అప్పుడప్పుడు భయంకరమైన శబ్దాలు కూడా వినిపిస్తాయని స్థానికులు చెబుతున్నారు. దెయ్యాలు ఉన్నాయనే ప్రచారం ముందు నుంచే ఉండడంతో 17వ శతాబ్దం నుండి ఈ కోట హాంటెడ్ టూరిస్ట్ స్పాట్‌గా మారిపోయింది.

ALSO READ: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌లు బంద్

మన దేశంలో ఉండే పురాతన కోటలు, రాజభవనాలు, యుద్ధభూముల వల్ల దెయ్యాల కథలు చాలానే వినిపిస్తాయి. రాజస్థాన్‌లోని భంగర్ కోట, పూణేలోని శనివార్ వాడా కోటలో దెయ్యాలు కనిపిస్తాయని చెబుతారు. ఓ యువరాజును హత్య చేయడంతో.. అతను దెయ్యంగా మారి అక్కడే తిరుగుతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రాంతాల్లో దెయ్యాలు ఉన్నాయని చెప్పడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. అయినప్పటికీ స్వయంగా ఈ ప్రదేశాలకు వెళ్లిన వారు తమకు నిజంగానే దెయ్యాలు కనిపించాయని చెప్పడంతో ఇవన్నీ మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్‌గా మారిపోయాయి.

హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.

Related News

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Hill Stations: హిల్ స్టేషన్స్ కు ఎగేసుకు వెళ్తున్నారా? అయితే, మీ పని అయిపోయినట్లే!

Special Trains: సికింద్రాబాద్ నుంచి ఆ నగరానికి స్పెషల్ ట్రైన్, ప్రయాణీకులకు గుడ్ న్యూస్!

Kakori Train Action: కాకోరి రైల్వే యాక్షన్.. బ్రిటిషోళ్లను వణికించిన దోపిడీకి 100 ఏళ్లు!

Secunderabad Station: ఆ 32 రైళ్లు ఇక సికింద్రాబాద్ నుంచి నడవవు, ఎందుకంటే?

Big Stories

×