E-Paper
Advertisement

Tirumala: తిరుమల శ్రీవారి ఆశీస్సులు ఉంటేనే ఆ దర్శనం టికెట్స్ దొరుకుతాయట, ఇంతకీ ఆ టికెట్లు ఏమిటో తెలుసా?

Tirumala: తిరుమల శ్రీవారి ఆశీస్సులు ఉంటేనే ఆ దర్శనం టికెట్స్ దొరుకుతాయట, ఇంతకీ ఆ టికెట్లు ఏమిటో తెలుసా?

Tirumala: తిరుమల శ్రీవారి ఆశీస్సులు ఉంటేనే ఆ దర్శనం టికెట్స్‌ దొరుకుతాయట. ఆ దర్శనం చేసుకోవడం పూర్వజన్మ సుకృతంగా కూడా భక్తులు భావిస్తుంటారు. అలాంటి టికెట్స్‌ కోసం రోజు వేలాది మంది ప్రయత్నిస్తుంటారు. అందులో కొందరికి మాత్రమే ఆ టికెట్స్‌ లభిస్తుంటాయి. ఆ కొందరు మాత్రమే ఆ దర్శనంలో పాల్గొని పునీతులు అవుతుంటారు. ఇంతకీ అది ఏ దర్శనం ఆ టికెట్స్‌ ఏంటి ఈ కథనంలో తెలుసుకుందాం.

తిరుమల శ్రీనివాసుని దర్శన భాగ్యం కోసం రోజూ లక్షలాది మంది భక్తులు ఎదురుచూస్తుంటారు. అయితే శ్రీవారి దర్శనం మాత్రం కొద్ది మందికే జరుగుతుంది. ఆ దేవదేవుడి దర్శనం చేసుకోవడానికి కూడా టీటీడీ చాలా మార్గాలను రూపొందించింది. అందులో భాగంగా తిరుమల శ్రీవారి దర్శనంలో అంగప్రదక్షిణ కూడా చాలా ముఖ్యమైనది. ఈ అంగ ప్రదక్షిణ టోకెన్స్‌ కోసం టీటీడీ బోర్డు లక్కిడిప్‌ నిర్వహిస్తుంది. అందులో లక్కిడిప్ తగిలిన వారికే అంగ ప్రదక్షిణ, దర్శనం  చేయడానికి  వీలు కల్పిస్తుంది.  అయితే తిరుమల శ్రీవారి ఆలయం లో పలు రకాల ప్రదక్షిణలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి మహా ప్రదక్షిణం, సంపంగి ప్రదక్షిణం, విమాన ప్రదక్షిణం, అంగ ప్రదక్షిణం. వీటిలో శ్రీవారికి అత్యంత ఇష్టమైన ప్రదక్షిణలు రెండు మాత్రమే అని ఆగమశాస్త్ర పండితులు చెప్తున్నారు.

మహా ప్రదక్షిణం:

ఈ ప్రదక్షిణ తిరుమల నాలుగు మాఢ వీధులలో భక్తులు పొర్లు దండాలు పెట్టేది. దీనికి భక్తులు కోనేరులో స్నానం చేసి వచ్చి పడుకుని పోర్లుతూ ప్రదక్షిణ చేస్తారు.

అంగ ప్రదక్షిణ:  

సాష్టాంగపడి స్వామి ఆలయంలో పొర్లు దండాలు పెట్టి మన సమస్యలు, కృతజ్ఞతలు శ్రీవారికి నివేదించుకునే ఒక శరణాగతి పద్ధతి. ఈ శరణాగతి పద్ధతిని అంగప్రదక్షిణ లేదా పొర్లుదండాలు అంటారు . స్త్రీ పురుషులు ఇందులో పాల్గొనవచ్చు. ప్రస్తుతం అంగ ప్రదక్షిణ టికెట్లు ఆన్ లైన్ ద్వారా రోజుకు 750 చొప్పున ఆ నెలకు సంబంధించిన టికెట్లు ఆన్లైన్ లోనే విడుదల చేస్తున్నారు.

అంగ ప్రదక్షిణ సమయం:

అంగప్రదక్షిణ టికెట్లు పొందిన భక్తులు శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి తడి బట్టలు తో రాత్రి సుమారు 12 గంటల సమయంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర లైన్ లో నిలబడి ఈ అంగప్రదక్షిణ సేవకు గుడిలో కి వెళ్ళవలసి ఉంటుంది. ఆడవాళ్లు చీర లేదా పంజాబీ డ్రెస్సు వేసుకోవచ్చును. మగవాళ్ళు పంచ లేదా ప్యాంట్ వేసుకోవాలి. మగవారికి పైన షర్ట్ కానీ బనియన్ కానీ ఉండకూడదు. వేరు వేరు లైన్లలో వీరిని సేవకు పంపుతారు ముందుగా ఆడవాళ్ళు పొర్లుదండాలు పెట్టి బయటకు వచ్చిన తరువాత మగవాళ్ళ అంగ ప్రదక్షిణ మొదలు అవుతుంది కావున ఆడవాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు.

అంగ ప్రదక్షిణ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు :

తిరుమల శ్రీవారికి మహిమాన్వితమైన సుప్రభాత సేవ జరుగుతున్నప్పుడు ఈ అంగప్రదక్షిణ సేవ గర్భాలయానికి బయట శ్రీవారి బంగారు బావి నుండి ప్రారంభమై శ్రీవారి హుండీ వరకు పొర్లు దండాలు పెడుతూ అంగప్రదక్షిణ సేవ జరుగుతుంది.

అంగ ప్రదక్షిణ చేసిన వారికి శ్రీవారి దర్శనం:

సుప్రభాత సేవ  జరిగిన వెంటనే లోపల తోమాలసేవ జరుగుతున్న సమయంలో అంగ ప్రదక్షిణ పూర్తి చేసిన భక్తులకు స్త్రీ పురుషులను వేరు వేరు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.జయ విజయుల వద్ద నుండి మాత్రమే దర్శనము చేసుకునే వీలు ఉంటుంది. ఇక అంగ ప్రదక్షిణ అయిపోయిన తర్వాత స్వామి వారి దర్శనం చేసుకుని బయటకు వచ్చే సరికి తెల్లవారుజామున 5 గంటలు అవుతుంది. బయటకు వచ్చిన తర్వాత గుడి ఎదురుగా దీపాలు వెలిగించే చోట ప్రశాంతంగా కాసేపు కూర్చుని ధ్యానం చేసుకుంటే స్వామి తన్మయత్వంలో మునిగిపోవచ్చు.

ALSO READ: పన్నెండు రాశులకు పన్నెండు జ్యోతిర్లింగాలు – ఏ రాశి వారు ఏ లింగాన్ని దర్శించుకోవాలో తెలుసా..?

 

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×