E-Paper
Advertisement

ట్రై కమిషనరేట్లలో మందుబాబుల మజాకా.. పోలీసుల తడాఖా..!

ట్రై కమిషనరేట్లలో మందుబాబుల మజాకా.. పోలీసుల తడాఖా..!
Advertisement

Drunken Driving: స్వేచ్ఛ బ్యూరో: ట్రై కమిషనరేట్ల పరిధుల్లో జరిపిన డ్రంకెన్​ డ్రైవ్ పరీక్షల్లో 495మంది మందుబాబులు పట్టుబడ్డారు. వీకెండ్ డ్రైవ్​ లో భాగంగా హైదరాబాద్ కమిషనరేట్​ పరిధిలో జరిపిన తనిఖీల్లో 239మంది పీకల దాకా మందు కొట్టి వాహనాలు నడుపుతూ దొరికారు. వీరిలో 190మంది ద్విచక్ర వాహనదారులు ఉండగా ఆటోలు నడుపుతూ 18మంది పట్టుబడ్డారు. ఇక, కార్లు డ్రైవ్​ చేస్తూ మరో 31మంది దొరికారు. వీరందరిపై కేసులు నమోదు చేసిన పోలీసులు వాహనాలను సీజ్​ చేశారు.

121మంది ద్విచక్ర వాహనదారులు

మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డ అందరినీ ఆయా కోర్టుల్లో హాజరు పరుస్తామని అధికారులు తెలిపారు. ఇక, సైబరాబాద్ కమిషనరేట్​ పరిధిలో జరిపిన తనిఖీల్లో 138మంది మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ దొరికారు. వీరిలో 121మంది ద్విచక్ర వాహనదారులు ఉన్నారు. ఇక, ఆటోలు నడుపుతూ 5గురు, కార్లు డ్రైవ్​ చేస్తూ 11మంది పట్టుబడ్డారు. భారీ వాహనాన్ని నడుపుతూ ఓ డ్రైవర్ దొరికాడు. అందరినీ ఆయా కోర్టుల్లో హాజరు పరుస్తామని అధికారులు చెప్పారు.

Advertisement

Also Read: ఇవి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లా.. సర్కార్ పై ఈటల రాజేందర్ నిప్పులు..!

మరో 7గురికి జరిమానా..

గత వారం పట్టుబడిన 403మందికి కోర్టులు భారీగా జరిమానాలు విధించినట్టు తెలిపారు. మల్కాజిగిరి కమిషనురేట్ పరిధిలో జరిపిన డ్రంకెన్​ డ్రైవ్​ టెస్టుల్లో 118మంది దొరికారు. వీరిలో 96మంది ద్విచక్ర వాహనదారులు ఉండగా ఆటోలు నడుపుతూ ముగ్గురు పట్టుబడ్డారు. కార్లు డ్రైవ్​ చేస్తూ మరో 18మంది దొరికారు. గత వారం పట్టుబడ్డ వారిలో 30మందికి ఆయా కోర్టులు జైలుశిక్ష, జరిమానా విధించినట్టు అధికారులు చెప్పారు. మరో 7గురికి జరిమానా విధించటంతోపాటు సోషల్ సర్వీస్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. మరో 455మందికి జరిమానాలు విధించాయని వివరించారు.

Advertisement

Also read: ఇండస్ట్రీ మహిళలకు సురక్షితం కాదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన సమంత!

Related News

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

Big Stories

Advertisement
×