E-Paper
Advertisement

Ugadi festival: ఉగాది పండుగ రోజు ఆ పనులు అసలు చేయకూడదట

Ugadi festival: ఉగాది పండుగ రోజు ఆ పనులు అసలు చేయకూడదట
Advertisement

Ugadi festival: ఉగాది పండుగ రోజు ఆ పనులు అసలు చేయకూడదట. తెలిసి చేసినా తెలియక చేసినా చాలా కష్టాలు వచ్చే ప్రమాదం ఉంటుందట. కొన్ని పనులు చేయడం వల్ల ఆర్థికపరమైన నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందట. అసలు ఉగాది పండుగ రోజు చేయకూడని ఆ పనులేంటో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగ రోజు కొన్ని పనులు తెలియకుండా చేసినా కష్టాలు పడతారట. పండుగ రోజు చేయకూడని పనులేంటో పురాణాలు ఉన్నట్టు పండితులు చెప్తున్నారు. పండితులు చెప్తున్న పండుగ రోజు చేయకూడని పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఆలస్యంగా నిద్ర లేవడం: ఉగాది పండుగ రోజు ఆలస్యంగా నిద్ర లేవకూడదట. ఆలా లేస్తే దరిద్ర దేవత నెత్తి మీద తాండవం చేస్తుందని పండితులు హెచ్చరిస్తున్నారు. పండుగ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం ఇంట్లో దేవుడి దగ్గర పూజ చేసుకుని తర్వాత గుడికి వెళ్లి దేవుడిని దర్శనం చేసుకోవాలని సూచిస్తున్నారు.

గొడవలు పెట్టుకోకూడదు: ఉగాది పండుగ రోజు ఎవ్వరితోనూ ఏ కారణంతోనూ గొడవలు పెట్టుకోకూడదట. చివరికి ఇంట్లో వాళ్లతో కూడా మాట వరసకైనా గొడవలు పెట్టుకోకూడదని పండితులు సూచిస్తున్నారు. పండుగ రోజు వివాదాలు, గొడవలు పెట్టుకోవడం వల్ల  ఈ సంవత్సరం మొత్తం ఇలాగే ఉంటుందని సూచిస్తున్నారు. కొత్త సంత్సరాన్ని ప్రశాంతంగా ప్రారంభించాలని కోరుతున్నారు.

Advertisement

ఇంటిని అస్తవ్యస్తంగా ఉంచకూడదు: ఉగాది రోజు ఇంటిని శుభ్రంగా ఉంచాలి. అస్తవ్యస్తంగా ఉంచితే లక్ష్మీదేవి కృప తగ్గుతుందని పండితులు హెచ్చరిస్తున్నారు.

చెడు మాటలు మాట్లాడకూడదు: పండుగ రోజు చెడు మాటలు మాట్లాడకూడదట. అబద్ధాలు చెప్పడం.. ఇతరులను దూషించడం లాంటివి చేయకూడదని పండితులు సూచిస్తున్నారు. కొత్త సంవత్సరాన్ని మంచి మాటలతో ప్రారంభిస్తే మంచిదని పెద్దలు చెబుతున్నారు.

భోజనం చేయక ముందే పచ్చడి తినాలి: ఉగాది పండుగ రోజు భోజనం చేయకముందే  శాస్త్రోక్తంగా దేవుడికి పూజాదికాలు చేసుకున్న తర్వాతే ఉగాది పచ్చడి తినాలి. ఆ తర్వాతే టిఫిన్స్ లేదా భోజనాలు చేయాలని సూచిస్తున్నారు పండితులు. ఇలా చేయడం వల్ల జీవితంలో సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించాలి అనే సంకేతంగా బావించాలని సూచిస్తున్నారు.

చెడు ఆలోచనలు పెట్టుకోకూడదు: ఉగాది పండుగ రోజు నెగటివ్ ఆలోచనలు పెట్టుకోవడం మంచిది కాదట. కొత్త సంవత్సరాన్ని  పాజిటివ్ ఆలోచనలతోనే  ప్రారంభించాలి సూచిస్తున్నారు. చెడు ఆలోచనలతో మనసును పాడు చేసుకుంటే సంవత్సరం మొత్తం అలాగే ఉంటుందని చెప్తున్నారు.

పంచాంగ శ్రవణం తప్పకుండా వినాలి: ఉగాది రోజు పండితులు చేసే పంచాంగ శ్రవణం తప్పకుండా వినాలని అది ఎంతో శుభసూచకమని చెప్తున్నారు. పంచాంగ శ్రవణం వల్ల ఈ సంవత్సరపు స్థితిగతులను తెలుసుకోవచ్చని సూచిస్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: ఈ నియమాలు పాటించకుండా ఎన్ని పూజలు చేసినా వృథాయేనట

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×