Arunachalam Temple: అరుణాచలం.. ఈ పేరు చెబితే భక్తులు పులకించి పోతారు. ఎప్పుడు స్వామిని దర్శించుకుంటామా? అంటూ ఎదురుచూస్తుంటారు. సాధారణంగా వెళ్లి దర్శించుకోవాలంటే సాధ్యం కాదు. శివుడి అనుగ్రహం లేకుంటే ఆయన దర్శనం కష్టమని కొందరు పండితులు తరచు చెబుతుంటారు.
అరుణాచలం వెళ్లామంటే ఖచ్చితంగా దర్శనం జరుగుతుందని భావిస్తుంటారు. ఒక్కోసారి కొందరికి ఆ భాగ్యం ఉండదు. తాజాగా అరుణాచలం దేవాలయం సమీపంలో భక్తుల మధ్య ఫైటింగ్‌కు దారి తీసింది. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్దాం.
నార్మల్‌గా భక్తులు ఎక్కడికి వెళ్లినా కాస్త తొందర పడుతుంటారు. వేగంగా దర్శించు కోవాలనే తపనలో ఉంటారు. ఈ క్రమంలో లేని సమస్యలు కోరి తెచ్చుకుంటారు. ప్రశాంతంగా స్వామిని చూసేందుకు వెళ్లి ఆగ్రహావేశాలకు గురయిన సందర్భాలు కోకొల్లలు.
శనివారం, ఆదివారం శ్రీహరిని దర్శించుకున్న భక్తులు తిరుమల నుంచి నేరుగా అరుణాచలం శివుడి దర్శనం కోసం వెళ్లారు. దర్శనం కోసం 3 కిలోమీటర్ల మేరా క్యూలైన్ ఉంది. సర్వదర్శనానికి 6 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. అదే సమయంలో వేగంగా దర్శనం చేసుకోవాలన్న ఆరాటంలో దేవాలయం వద్ద లైనులో ఏపీ- కర్నాటక భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకుంది.
ALSO READ: తెలుగు రాశి ఫలితాలు, ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం, కొత్త వ్యక్తులతో పరిచయాలు
అప్పటివరకు ప్రశాంతంగా స్వామి గురించి చర్చించుకున్నారు. అంతలోనే వారిలోని కొత్త వ్యక్తిని బయటకు తీశారు. కోపానికి గురైన ఏపీ-కర్ణాటక భక్తులు ఒకరిపై మరొకరు పంచ్‌లు విసురుకున్నారు. కొందరైతే చొక్కా పట్టుకుని లాగి కొట్టారు. ఆ తర్వాత తమ ప్రతాపాన్ని చూపుకున్నారు భక్తులు.
ఈ విషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కొంతమందికి గాయాలు కావడంతో వెంటనే సమీపంలో ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రశాంతంగా స్వామిని దర్శించుకోవడానికి వెళ్లి అందులో కొంతమంది దర్శనం చేయకుండా వెనుదిరగాల్సివుంది. ఎందుకంటే ట్రైన్ మిస్సయిపోతుందనే భావనతో వెనక్కి వచ్చేశారు.
అరుణాచలం వెళ్తున్నారంటే దేవుడి దగ్గర మస్టరు వేసుకోవడమేనని కొందరు పండితుల మాట. ఎందుకంటే శివానుగ్రహం లేకుంటే అడుగులు వేయలేమని అంటుంటారు. బ్రహ్మ, విష్ణు, శివుడు అడుగులు పెట్టిన ప్రాంతం ఒకటైతే, స్వయంగా శివుడు తన రూపాన్ని ప్రదర్శించిన చోటు కావడంతో ఆ ప్రాంతానికి అంత ప్రాముఖ్యత ఏర్పడింది.
#Arunachalam pic.twitter.com/cC8vmpEH95
— Cinema Madness 24*7 (@CinemaMadness24) June 1, 2025